BREAKING
నామినేషన్లలో నిబంధనలు ఉల్లంఘిస్తే సహించేది లేదు : కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం డ్రైనేజీ సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలి : కలెక్టర్ డీకే బాలాజీ కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి పర్యటనకు పకడ్బందీ భద్రత, ప్రోటోకాల్ ఏర్పాట్లు చేయాలి మేరా యువ భారత్ యూత్ వాలంటీర్‌గా సాయి వంశీ గౌడ్ ఎంపిక సుధాకర్స్ ఐడియల్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు ఘనంగా బాలల దినోత్సవం శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ ధర్మశాస్త్ర స్వామివారి హోమం శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ ధర్మశాస్త్ర స్వామివారి హోమం జనగణన 2027 జనాభా లెక్కింపును అత్యంత కచ్చితత్వంతో నిర్వహించాలి విద్యార్థులు సాంస్కృతిక పోటీల్లో రాణించాలి గ్రామ పంచాయతీ ఎన్నికల వ్యయ నిర్వహణలో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలి పాల్వంచలో ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు నవంబర్ 16వ తేదీ నుంచి ఎరువుల పంపిణీకి నూతన విధానం అమలు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు చేయూత

హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణ పై అవగాహన కలిగించండి -జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె. కృష్ణ

Select Suryaa Now
హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణ పై  అవగాహన కలిగించండి  -జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె. కృష్ణ

నాగర్ కర్నూల్ క్రైమ్ , సూర్య న్యూస్: హెచ్ఐవి/ ఎయిడ్స్ నివారణ పై పాఠశాల ,కళాశాల విద్యార్థులకు, డ్రైవర్స్ కు, వలస కుటుంబాలకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కి. కృష్ణ తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లోని మినీ సమావేశం మందిరంలో నాగర్ కర్నూల్, గద్వాల, వనపర్తి జిల్లాల ఐ సి టి సి కౌన్సిలర్లకు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులకు  జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ  మాట్లాడుతూ ప్రతి గర్భవతికి హెచ్ఐవి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి, పాజిటివ్ గర్భవతులు క్రమం తప్పకుండా ఏ ఆర్ టి మందులు  వాడుకంపై ప్రత్యేక దృష్టి సారించి, తల్లి నుండి పుట్ట బోయే బిడ్డకు   హెచ్ఐవి అంటూ సోకకుండా  సిబ్బంది కృషి చేయాలని  తెలిపారు. హై రిస్క్ గ్రూపులైన ఆటో, లారీ ,ట్రక్ డ్రైవర్లకు , ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వలస కుటుంబాలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, వ్యక్తిగతంగా కౌన్సిలింగ్ చేస్తూ, అవసరం వారికి హెచ్ఐవి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని  తెలిపారు. తదనంతరం హెచ్ఐవి ఎయిడ్స్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ రఫిక్ మాట్లాడుతూ ప్రతి ఒక్క పేషెంట్ వారి యొక్క మందులను క్రమం తప్పకుండా వాడి వైరల్ లోడ్ ను తగ్గించుకునేలాచూసుకోవాలని , హెచ్ఐవి సోకి అవకాశం గురించి స్వయంగా మూల్యాంకనం చేసుకోవాలని, దీనిపై సిబ్బంది విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.  కార్యక్రమంలో   దిశా కార్యక్రమ మేనేజర్ రమేష్, రవీంద్ర రెడ్డి,సాయికుమార్, రెడ్డి, ఐ సి టి సి కౌన్సిలర్లు,  స్వచ్ఛంద సంస్థ ఉద్యోగులు నిర్వహకులు తదితర సిబ్బంది పాల్గొన్నారు
----