telangana
ఎమ్మెల్యే అభివృద్ధి పనులను చూసి బీఆర్ఎస్‌లో చేరిన కుమారి ఉప సర్పంచ్, వార్డు సభ్యులు
సూర్య.నేరడిగొండ : బోథ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతోంది. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న సేవలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్‌లో చేరుతున్నారు.ఈ క్రమంలో గురువారం మండలంలోని కుమారి మేజర్ గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ ఆడెపు రవితో పాటు వార్డు సభ్యులు మెస్రం సంబు, వోర్స సాయి యాదవ్, నందడెపు రవి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో వారు గులాబీ కండువాలు కప్పుకొని పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇందులో నేరడిగొండ మాజీ జెడ్పీటీసీ గడ్డం భీమ్ రెడ్డి, వార్డు సభ్యుడు జి. సంతోష్ తదితరులు పాల్గొన్నారు.