భక్తిశ్రద్ధలతో నాగుల చవితి
బుచ్చిరెడ్డిపాలెం, మేజర్ న్యూస్ : నాగుల చవితి సందర్భంగా స్థానిక రామాలయం సమీపంలో గల నాగుల పుట్ట వద్ద శుక్రవారం భక్తిశ్రద్ధలతో నాగుల చవితి పండుగను జరుపుకున్నారు. కార్తీక మాసంలో ని మొదటి శుక్రవారం కావడంతో మహిళలు వేకువజామునే తల స్నానం ఆచరించి నాగుల పుట్ట వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రసాదా లు పంపిణీ చేశారు.