BREAKING
వైభవంగా మణవాళ మహామునుల వర్ష తిరు నక్షత్ర మహోత్సవం 108 అంబులెన్సీలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అధికారులు భర్తని పిలుస్తుంటే ఇప్పటికీ క్యూట్‌గా ఉంది.. సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవికి నటి అహానా కృష్ణ బర్త్ డే విషెస్ అండూరులో ఉచిత పశువైద్య శిబిరం యాచారం ముదిరాజ్ సంఘం గ్రామ కమిటీ ఎన్నిక రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం* పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి *పారిశ్రామిక ప్రాంతంలో రోడ్లపైనే భారీ వాహనాల పార్కింగ్* అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది విద్యార్థుల దుర్మరణం అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో పట్టణ ఎస్సీ కౌన్సిలర్లకు సన్మానం బాలలు ఆనందంగా బాల్యాన్ని గడపాలి దాతృత్వ స్ఫూర్తిని చాటిన గీతం బీ-స్కూల్ విద్యార్థులు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పల్లె పోరు అయినా ప్రజాస్వామ్యబద్ధంగా జరపండి జిల్లా వికలాంగుల కమిటీలో చేర్యాల వాసికి స్థానం* సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో తుమ్మలపల్లి అనిల్‌కు ఘన సన్మానం శ్రీ కపిలేశ్వరాలయంలో భక్తిశ్రద్ధలతో ముగిసిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం

స్థానిక సమరానికి జనసేన కసరత్తు. ఉదయగిరినియోజకవర్గంలో మండలాల వారీగా నేతల సన్నాహాలు.

Select Suryaa Now
స్థానిక సమరానికి జనసేన కసరత్తు. ఉదయగిరినియోజకవర్గంలో మండలాల వారీగా నేతల సన్నాహాలు.

వింజమూరు, మేజర్ న్యూస్ :  ఉదయగిరి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి జనసేన పార్టీ కసరత్తు ముమ్మరం చేస్తోందనీ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త భోగినేని కాశీ రావు తెలిపారు శుక్రవారం  స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూనాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నట్లు ఆయన తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ బలమైన ప్రాతినిధ్యం సాధించే దిశగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. మండలాల వారీగా పార్టీ పరిస్థితి, బలాబలాలు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులను గుర్తించి ఎన్నికల బరిలో నిలిపేందుకు కసరత్తు చేస్తున్నామని పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆశయాలు, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని బోగినేని కాసిరావు తెలిపారు.నియోజకవర్గంలోని అన్ని మండలాల జనసేన నాయకులు సమన్వయంతో పనిచేసి స్థానిక సమరంలో పార్టీ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు సత్యనారాయణ, ఇమ్రాన్, వెంకీ, సురేష్, రామూర్తి, తదితర జనసేన నాయుకులు పాల్గొన్నారు.