BREAKING
యెమెన్ హూతీ రెబెల్స్‌పై ఒత్తిడి పెంచాలని ఫ్రాన్స్ నిర్ణయం వై.సి.పి నుండి టి.డి.పి లో చేరిన కుటుంబాలు వరిలో సంభవించే తెగుళ్లపట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి--ఏవో బ్రహ్మ రెడ్డి రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి....... ఓఆర్ఎస్‌ అనుకుని ఎలుకల మందు తాగి వృద్ధురాలు మృతి నికోలస్ ప్యుచ్‌కు కాగ్నిటివ్ పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశం -డిజిటల్ నైపుణ్యాలతో స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి -ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం.ప్రవీణ నీరు, విద్యుత్ను పొదుపుగా వాడండి.. వృధాను అరికట్టండి.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణే లక్ష్యం నామినేషన్ కేంద్రాలు, ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ అంకితా సురానా విద్యార్థినులు తమ సమస్యలను రహస్యంగా తెలియజేసేందుకు ప్రతి పాఠశాలలో మరియు కళాశాలలో షీ బాక్సుల ఏర్పాటు ఎస్సై చైతన్య కిరణ్ మెగాస్పీడ్ సంస్థపై ఆంక్షలకు ఎప్పట్నుంచో ట్రెజరీ అనుకూలం ఘనంగా కలిశెట్ల రెడ్డి గణేష్,యామినిల వివాహ వేడుక : హాజరైన ప్రముఖులు,గ్రీన్ హార్ట్ సొసైటీ సభ్యులు ఇసుక ట్రాక్టర్ల ఆగడాలకు అడ్డుకట్ట ఏదీ? పట్టణ రహదారులపై యథేచ్ఛగా ఇసుక రవాణా.. కవర్లు లేకుండా అతివేగం వాహనదారుల కళ్లలో ఇసుక.. ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతున్న ట్రాక్టర్లు – అధికారులు స్పందించరా? చేర్యాలలో డయాగ్నస్టిక్ ల్యాబ్ ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా సంఘం కే గ్రామంలో ఏళ్ల నాటి డ్రైనేజీ సమస్యకు మోక్షం

భారత్ సమ్మిట్‌లో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు

Select Suryaa Now
భారత్ సమ్మిట్‌లో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు

హైదరాబాద్: 'భారత్ సమ్మిట్'లో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగిస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ పర్యటనపై మరియు భారత్ సమ్మిట్ నిర్వహణపై బీజేపీ చేస్తున్న విమర్శలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతిపక్ష నేత పర్యటనపై బీజేపీకి అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడని, ఆయనకు కేబినెట్ హోదా ఉందని గుర్తుచేసిన సీఎం రేవంత్ రెడ్డి.. అటువంటి వ్యక్తిని అవమానించడం ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నారు. చర్చలు, సంప్రదింపులే ప్రజాస్వామ్యానికి అసలైన బలమని, రాహుల్ విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబించడం సరికాదని ఆయన విమర్శించారు. ప్రధాని మోదీ ఏం చేసినా కరెక్ట్ అని, రాహుల్ గాంధీ చేస్తే తప్పా అని ఆయన నిలదీశారు. రాహుల్ గాంధీ భవిష్యత్తులో ప్రధాని అవుతారనే భయంతోనే బీజేపీ నేతలు ఆయనపై విమర్శలు చేస్తున్నారని సీఎం ఆరోపించారు.

కేవలం రాజకీయ విమర్శలతో దేశానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని రేవంత్ రెడ్డి అన్నారు. 'భారత్ సమ్మిట్'లో తీసుకునే తీర్మానాలు భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, అటువంటి సదస్సును వ్యతిరేకించడం సరికాదని ఆయన హితవు పలికారు. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ప్రస్తావిస్తూ.. తెలంగాణలో తమ ప్రభుత్వం తీసుకువచ్చిన గిగ్ వర్కర్స్ (Gig Workers) పాలసీ దేశంలోనే అత్యుత్తమమైనదని, గిగ్ వర్కర్ల సంక్షేమానికి తాము నిరంతరం కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.