చేర్యాలలో డయాగ్నస్టిక్ ల్యాబ్ ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా
చేర్యాల: చేర్యాల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్ ల్యాబ్‌ను శుక్రవారం జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ల్యాబ్‌లో అందుబాటులో ఉన్న వైద్య పరీక్షల సదుపాయాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు స్థానికంగానే నాణ్యమైన వైద్య పరీక్షలు అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. వైద్య పరీక్షల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గడంతో ప్రజలకు సమయం, ఖర్చు ఆదా అవుతాయని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో డయాగ్నస్టిక్ ల్యాబ్‌లు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.