BREAKING
రబీ సాగులో నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించాలి ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం *గనుగాపూర్ పుణ్యక్షేత్రానికి మహా పాదయాత్ర ప్రారంభం భక్తులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే* *రైతులకు వ్యవసాయ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలి* భారత్ సమ్మిట్ లో పాల్గొన్న సుడా మాజీ చైర్మన్ రా అండ్ రస్టిక్ మాస్ అవతారంలో త్రిగుణ్.. టెర్రిఫిక్ యాక్షన్‌తో జంగా గ్లింప్స్ విడుదల! *గనుగాపూర్ పుణ్యక్షేత్రానికి మహా పాదయాత్ర ప్రారంభం భక్తులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే* నారాయణఖేడ్ మేజర్ న్యూస్ నారాయణఖేడ్ పట్టణం నుండి ప్రతి సంవత్సరం ఎంతో భక్తిశ్రద్ధలతో పవిత్ర పుణ్యక్షేత్రమైన గనుగాపూర్‌కు నిర్వహించే మహా పాదయాత్ర ఈ ఏడాది కూడా ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా శుక్రవారం పెద నితిన్ అలియాస్ రుక్మిణీ నుంచి మెస్మరైజింగ్ లవ్ మెలోడీ.. పిచ్చి ప్రేమలో పాట విడుదల! మూగవాడి సర్పంచ్ బరిలో తిమ్మారెడ్డి : వైసీపీ బలపరిచిన అభ్యర్థిగా పంచాయతీ ఎన్నికల్లో పోటీ : ప్రజలు అవకాశమిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని వెల్లడి ప్రస్తుత యువత మారుతున్నటెక్నాలజీ నికి అనుగుణంగా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి - జాయింట్ కలెక్టర్ నూరుల్ కుమార్ గోవా చలనచిత్రోత్సవంలో నివిన్ పౌలీ సర్వం మాయ అరుదైన ఘనత.. ఇండియన్ పనోరమ విభాగంలో ఎంపిక! పెంచలకోనలో వైభవంగా తిరుప్పావడ సేవ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు వెంటనే చెల్లించండి.. *ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ లేదా నిజం మాట్లాడితే బెదిరింపులా ఇదేనా మీ ప్రజాపాలనా సంస్కారం మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి*

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో దళారీ దందా....

Select Suryaa Now
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో దళారీ దందా....

మద్దూర్ ..…మద్దూరు మండలంలోని ఆయా గ్రామాలలో అధికారులు ప్రజాప్రతినిధులు ఆర్భాటంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి గాలికి వదిలేసారు. దీంతో దళారీలు నేరుగా అధికారులు ప్రజాప్రతినిధులు ప్రారంభించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యం సేకరిస్తూ కాంటాలు నిర్వహిస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రోజులు గడిస్తున్న ఇప్పటివరకు కొనుగోలు ప్రారంభించకపోవడంతో కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన ధాన్యం విక్రయం కాకపోవడంతో రైతుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ దళారీలను ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే సమయంలో ప్రజా ప్రతినిధులు అధికారులు దళారులను ఆశ్రయించి రైతు మోసపోకూడదని ప్రభుత్వం కల్పించే మద్దతు ధరకు కొనుగోలు కేంద్రాలలోని ధాన్యాన్ని విక్రయించే లబ్ధి పొందాలని నీతి వ్యాఖ్యలు చేసి చేతులు దులుపుకున్నారు. ఇదే అదునుగా చేసుకొని దళారీలు రైతుల నుండి తక్కువ ధరలకు ధాన్యాన్ని సేకరించి మూడు పువ్వులు ఆరు కాయలుగా రైతుల నుంచి ధాన్యాన్ని దండుకుంటూ లాభాలు పొందుతున్నారని వివిధ గ్రామాల పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కలిగిన ఆర్భాటం ధాన్యాన్ని కూడా సేకరించాలని విషయంలో కూడా అంత ఆర్భాటం ఎందుకు లేదని వివిధ గ్రామాల రైతులు మండిపడుతున్నారు. నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలోకి ప్రైవేట్ దళారులు ప్రైవేట్ వాహనాలతో వచ్చి కాంటలు నిర్వహిస్తూ కొనుగోలు చేస్తున్న అధికారులు చోద్యం చూస్తూ తమకేం పట్టనట్టుగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రారంభించిన కొనుగోలు కేంద్రాలలో రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతాంగాని ఆదుకోవాలని వివిధ గ్రామాల రైతులు కోరుతున్నారు.