BREAKING
సీతారామభద్ర క్షేత్ర నిర్మాణానికి రామాయంపేట మున్సిపల్ చైర్ పర్సన్ వీరాళం అంగన్‌వాడీ కార్యకర్తలకు ‘పోషణ్‌ భీ పఢాయీ భీ’పై రెండో రోజు శిక్షణ అంతర్జాతీయ మార్కెట్ కోసం అరకు కాఫీని సేకరించండి. -ఎస్ఎల్ఎన్ కాఫీ చైర్మన్ శతప్పన్ తో భేటీలో మంత్రి నారా లోకేష్ ప్ర‌తిపాద‌న‌. భూముల రీసర్వేను వేగవంతం చేయాలి - కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ కార్యకర్తల చేరికలు.. -- లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతిపై కేంద్రం నిషేధం: 'బ్లాక్ మాస్' ఎగుమతులకు బ్రేక్ రామాయణంలో ఇంద్రుడి పాత్రతో థాయ్‌లాండ్‌లో కునాల్ కపూర్ క్రేజ్.. ఆకట్టుకుంటున్న విదేశీ అభిమానుల కవితలు విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి – అదనపు ఎస్పీ సత్యనారాయణ మండలంలో విస్తృతంగా పర్యటించిన బీజేపీఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి డ్వాక్రా గ్రూపులు-ఏపీ ఉత్ప‌త్తులకు వాల్ మార్ట్‌, ఫ్లిఫ్‌కార్ట్ స‌ప్లై చైన్ల‌లో చేర్చండి. -వాల్ మార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పాల్ డైక్‌తో భేటీలో మంత్రి లోకేష్ ప్ర‌తిపాద‌న‌. ఈ నెల 15న హైదరాబాదులో జరిగే "హలో నేతకాని చలో ఉస్మానియా" పోస్టర్ల విడుదల ఆసియాన్ అంటే ఏమిటి? ప్రాంతీయంగా ఈ కూటమి ఎందుకు అత్యంత కీలకం? సీఐఐ 31వ పార్టనర్ షిప్ సమ్మిట్‌లో విద్య‌, ఐటీ, ఎల‌క్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖ‌ల‌ మంత్రి నారా లోకేష్ భారతదేశంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో గణనీయమైన పెరుగుదల: రూ. 14 లక్షల కోట్ల మార్కు దాటిన ఆదాయం ఆపదలో ఉన్న ఖాతాదారుడి కుటుంబానికి గాయత్రి బ్యాంకు ఆర్థిక భరోసా

సర్వే విభాగం ఆధునికీకరణకు శ్రీకారం

Select Suryaa Now
సర్వే విభాగం ఆధునికీకరణకు శ్రీకారం
సూర్య, మందమర్రి : సింగరేణి మందమర్రి ఏరియాలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా వినియోగించుకునే దిశగా మరో ముందడుగు పడింది. ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలోని సర్వే విభాగంలో నూతనంగా ఏర్పాటు చేసిన అధునాతన హై-ఎండ్ కంప్యూటర్లను గురువారం ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గనుల నిర్వహణ, బొగ్గు ఉత్పత్తి కార్యకలాపాల్లో సర్వే విభాగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఈ విభాగానికి ఆధునిక సాంకేతికతతో కూడిన కంప్యూటర్లు అందుబాటులోకి రావడం వల్ల సర్వేకు సంబంధించిన సమాచార విశ్లేషణ, మ్యాపింగ్‌తో పాటు వివిధ సాంకేతిక పనులను మరింత వేగంగా, కచ్చితత్వంతో నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. నూతన కంప్యూటర్ల వినియోగంతో సర్వే విభాగం పనితీరు మరింత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కేకేఓసీపీ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాంబాబు, డీజీఎం (సర్వే) ముఖ్య దేశాయ్, ఐటీ మేనేజర్ రవి, జూనియర్ సర్వే అధికారులు నరేష్, సదానందం, సర్వే విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.