BREAKING
ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ గారికి ఐ ఎ ల్ వినతి ఇంధన ధరల పెరుగుదలపై ఫెడ్ వడ్డీ రేట్లు పెంచకూడదన్న ట్రెజరీ చీఫ్ స్కాట్ బెసెంట్ బెదిరింపులకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ తిరుణాల తిప్ప వద్ద ఘనంగా నాగుల చవితి వేడుకలు ప్రమాదాలకు నిలయంగా ఎల్కతుర్తి–సిద్దిపేట జాతీయ రహదారి ఇంకెన్ని ప్రాణాలు బలికావాలి? రక్షణ చర్యలు చేపట్టేది ఎప్పుడు? పొదలకూరు రైతు బజార్‌లో ప్రత్యేక రైస్ కౌంటర్ పరిశీలన అగ్నిప్రమాద భయంతో 7.20 లక్షల బీఎండబ్ల్యూ కార్ల రీకాల్ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం ప్రైవేట్ పనులకు గ్రామపంచాయతీ ట్రాక్టర్...... సిద్ధలకోనలో 167 నూతన నాగశిలల ప్రతిష్ఠా మహోత్సవం వైభవం! వేద మంత్రోచ్ఛారణల నడుమనాగశిలలకుప్రాణప్రతిష్ఠ.. ముఖ్య అతిథిగా బ్రహ్మశ్రీ రామాయణం మహేష్ స్వామి కోరిటికల్‌లో అంగన్వాడీ భవనం ప్రారంభం. : ఫుట్ బాల్ క్రీడాకారిని భానోత్ శైలజకు ప్రభుత్వం తరఫున లక్ష రూపాయల ఆర్థిక సహాయం శ్రీ గాయత్రి స్కూల్లో ఉచిత కంటి వైద్య శిబిరం! ఎస్.ఈ.ఐ.ఎల్ సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ వైసీపీకి 25 ఎంపీటీసీ స్థానాలు క్లైమేట్ ఫైనాన్స్ కోసం రూ. 10 బిలియన్ల ప్రత్యేక భాగస్వామ్యం

డ్వాక్రా గ్రూపులు-ఏపీ ఉత్ప‌త్తులకు వాల్ మార్ట్‌, ఫ్లిఫ్‌కార్ట్ స‌ప్లై చైన్ల‌లో చేర్చండి. -వాల్ మార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పాల్ డైక్‌తో భేటీలో మంత్రి లోకేష్ ప్ర‌తిపాద‌న‌.

Select Suryaa Now
డ్వాక్రా గ్రూపులు-ఏపీ ఉత్ప‌త్తులకు వాల్ మార్ట్‌, ఫ్లిఫ్‌కార్ట్ స‌ప్లై చైన్ల‌లో చేర్చండి.  -వాల్ మార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పాల్ డైక్‌తో భేటీలో మంత్రి లోకేష్ ప్ర‌తిపాద‌న‌.

సూర్య స్టేట్ బ్యూరో.

విశాఖపట్నం: వాల్ మార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ & బిజినెస్ డిప్లొమసీ) పాల్ డైక్ తో  విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ సముద్ర ఆహారం, వస్త్రవ్యాపారంలో బలమైన భాగస్వామ్యాలు, పెట్టుబడులను అన్వేషించడానికి ఏపీలో జరిగే ఎంఎస్ఎంఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కొనుగోలుదారులను ఏపీకి తీసుకురావాల్సిందిగా కోరారు. గతంలో న్యూఢిల్లీలో జరిగిన వాల్‌మార్ట్ గ్రోత్ సమ్మిట్ భారతదేశానికి చెందిన సరఫరాదారులు, వ్యవస్థాపకులు తమ ఉత్పత్తులను వాల్‌మార్ట్ గ్లోబల్ కొనుగోలుదారులకు పరిచయం చేయడానికి సహాయపడిందని గుర్తుచేశారు. స్వయం ఏపీ, లేపాక్షి బ్రాండ్ల కింద స్థానిక కళాకారులు, మహిళలు నడిపే ఎస్‌హెచ్‌జీలను వాల్‌మార్ట్, ఫ్లిప్ కార్ట్ దేశీయ, ప్రపంచ సప్లై చైన్‌లలోకి ప్రత్యేకంగా చేర్చడానికి మార్గాన్ని సులభతరం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

వాల్ మార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పాల్ డైక్ స్పందిస్తూ... ఏపీ రొయ్యల అతిపెద్ద కొనుగోలుదారులలో వాల్ మార్ట్ ఒకటిగా ఉంది, సంవత్సరానికి 6.5 కోట్ల పౌండ్లకు పైగా రొయ్యలను తమ సంస్థ కొనుగోలు చేస్తోంది, దీనితో పాటు రాష్ట్రం నుంచి ఫార్మా, వస్త్రాలు, ఇంజనీరింగ్ వస్తువులు కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ఏపీలో ఫ్లిప్ కార్ట్ ఇప్పటికే పెట్టిన పెట్టుబడుల వల్ల 28,000కు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ‌-ఉపాధి అవ‌కాశాలు ల‌భించాయి. సుమారు 12 లక్షల చదరపు అడుగుల మౌలిక సదుపాయాల స్థలం, 0.33 మిలియన్ చదరపు అడుగుల హోల్‌సేల్ స్థలంతో రాష్ట్రవ్యాప్తంగా 100కు పైగా లాజిస్టిక్స్ హబ్‌ల ద్వారా సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఏపీ ఎంఎస్ఎంఈ కార్పోరేషన్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్‌టీఐహెచ్) తో ఎంవోయూ మేరకు ఏపీలో 3,200కు పైగా ఎంఎస్ఎంఈలకు శిక్షణ ఇచ్చాం, వాటిలో 900కు పైగా ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్ మార్కెట్‌ప్లేస్‌లో చేర్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని పాల్ డైక్ చెప్పారు.