పొదలకూరు రైతు బజార్‌లో ప్రత్యేక రైస్ కౌంటర్ పరిశీలన
పొదలకూరు, మేజర్ న్యూస్ : స్థానిక రైతు బజార్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక రైస్ కౌంటర్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ నెల్లూరు జిల్లా మేనేజర్ కే. శ్రీనివాసులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విక్రయాలకు అందుబాటులో ఉన్న బియ్యం బస్తాల నాణ్యతను తనిఖీ చేసి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక రైస్ కౌంటర్ ద్వారా ఇప్పటివరకు 823 బస్తాల బియ్యాన్ని వినియోగదారులకు విక్రయించినట్లు తెలిపారు. ప్రస్తుతం మరో 100 బస్తాల నిల్వ అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వినియోగదారులకు నాణ్యమైన బియ్యం అందేలా సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ పరిశీలనలో సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ రవి, రైతు బజార్ సూపర్‌వైజర్ ప్రవీణ్, వీఆర్వో మస్తాన్ పాల్గొన్నారు.