తిరుణాల తిప్ప వద్ద ఘనంగా నాగుల చవితి వేడుకలు
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు పట్టణంలో తిరునాళ్ల తిప్ప వద్ద వెలిసి ఉన్న కాసినాయన ఆశ్రమంలో నాగుల పుట్ట వద్ద సమీప గ్రామాల ప్రజలు నాగుల చవితి సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఉదయం నుండి రాత్రి పొద్దుపోయే వరకు ఇక్కడ నాగదేవతను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. భక్తులు పుట్టలో పాలు పోసి చలివిడి పిండి, సద్దలు నూగుల చిమ్మిరి, కోడిగుడ్లు నైవేద్యంగా పెట్టి స్వామి వారిని మొక్కులు మొక్కుకుంటారు. భారీ నాగ పడగ తో ఉన్న ఇక్కడ నాగమ్మ దేవతను దర్శించుకునేందుకు భక్తులు భారీగా విచ్చేసి మొక్కులు తీర్చుకుంటారు.