BREAKING
*దొంగతనం కేసుల ఛేదనలో పోలీసు అధికారుల ప్రతిభకు ఎస్పీ ప్రశంసలు!* పెంచలకోనలో వైభవంగా తిరుప్పావడ సేవ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులకు భూమిపూజ ఛట్ పూజ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మాద్రి పృథ్వీరాజ్ *చింతలగట్టులో చలి సెగలు.. చలి మంటల చుట్టూ జనం!* పోలీస్ సిబ్బంది సంక్షేమమే శాఖ ప్రాధాన్యం: ఎస్పి బాల్య వివాహాల నిర్మూలనకు సమష్టి కృషి చేయాలి - మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానంలో వైభవంగా రాహుకాల ఉద్యాపన, కార్తీక దీపోత్సవ పూజలు *చింతలగట్టులో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు* మదనపల్లి అభివృద్ధిపై మాట్లాడే అర్హత వైకాపాకి లేదు : కూటమి ప్రభుత్వ పాలనపై విమర్శలు చేస్తే ఖబర్దార్ : హెచ్చరించిన తెలుగుదేశం ముఖ్యనేతలు విద్యార్థి దశ నుండి గమ్యాన్ని ఎంచుకోవాలి.. సౌరవిద్యుత్‌లో ఏపీ ముందంజ.. భవిష్యత్తులో 50 శాతం పారిశ్రామికవేత్తలు మహిళలే సురక్షితంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు నేటి దినపత్రిక సూర్య కథనానికి స్పందన శ్రీనివాసనగర్‌లో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ.. పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ దుర్గి మండలంలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

ప్రతికూల పరిస్థితుల్లోనూ వైసీపీకి 25 ఎంపీటీసీ స్థానాలు

Select Suryaa Now
ప్రతికూల పరిస్థితుల్లోనూ వైసీపీకి 25 ఎంపీటీసీ స్థానాలు

పొదలకూరు,  మేజర్ న్యూస్ :    సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు, అధికార పార్టీ ఒత్తిళ్లు, బెదిరింపులను ఎదుర్కొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిందని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పొదలకూరులోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీ 25 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుందని తెలిపారు. మరో ఐదు ఎంపీటీసీ, రెండు జెడ్పీటీసీ స్థానాలను, ఒక మండల పరిషత్‌ స్థానాన్ని అక్రమాలు, కుట్రల కారణంగా కోల్పోయామని ఆరోపించారు. ముత్తుకూరు జెడ్పీటీసీ అభ్యర్థి పరిమళమ్మ విజయం సాధించినప్పటికీ 57 ఓట్ల తేడాతో ఓడిపోయినట్లు ప్రకటించారని విమర్శించారు. పొదలకూరు జెడ్పీటీసీ అభ్యర్థి బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డిని సైతం కౌంటింగ్‌లో జరిగిన పరిణామాలతో 46 ఓట్ల తేడాతో ఓడించారని పేర్కొన్నారు.గతంలో రెండు ఎంపీటీసీ స్థానాలకే పరిమితమైన టీడీపీ.. ప్రస్తుతం అధికారంలో ఉండి యంత్రాంగాన్ని ఉపయోగించుకున్నప్పటికీ వైసీపీ 25 స్థానాలు గెలుచుకోవడం ప్రజా మద్దతుకు నిదర్శనమన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించిందని పేర్కొన్నారు. సర్వేపల్లిలో సోమిరెడ్డి రాజకీయ పతనానికి ఈ ఫలితాలు తొలి అడుగని వ్యాఖ్యానించారు.రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని కాకాణి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపి, తమకు అండగా నిలిచిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.