BREAKING
నశా ముక్త్ భారత్ బ్లాక్ స్థాయి క్రీడలు విజయవంతం న్యాయవాద పరిషత్‌ జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక. మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్త సేవల అంతరాయంపై ట్రంప్ అధికారి వ్యంగ్యాస్త్రాలు: H-1B వీసా నియామకాలను ప్రస్తావిస్తూ విమర్శ నిరుద్యోగ మహిళలకు భరోసా -ఈ నెల 22న పెద్దపల్లిలో మహిళ ‘మెగా జాబ్ మేళా’ ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్య సాధన దిశగా భారత్ దూకుడు.. శీతాకాల సమావేశాల్లో ఎంఎస్ఎంఈ, లాజిస్టిక్స్ రంగాలపై తొలి ఇంటిగ్రేటెడ్ ఆడిట్ నివేదికలను ప్రవేశపెట్టనున్న కాగ్ నూతన అడ్వకేట్ బండారి రవికి ఘన సన్మానం... రైతులకు అండగా ఉంటాం మాజీ చైర్మన్ కాంటే కార్ మధుమోహన్ ఆసియాలో టాప్ రియల్ ఎస్టేట్ పెట్టుబడి గమ్యస్థానంగా అవతరించిన భారత్: 5.5 బిలియన్ డాలర్ల నిధుల ప్రవాహం భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం: తుది అడ్డంకులపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర స్పందన ఆధునిక నవభారత నిర్మాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏరోసిటీలో ఘనంగా ‘అవెనీర్–2026’ వార్షిక క్రీడోత్సవం మాక్ గ్రామ సభ నిర్వహించిన చిన్నారులకు బహుమతి అందజేసిన సర్పంచ్, ఉప సర్పంచ్ క్రమశిక్షణ పట్టుదల తో లక్ష్యాలు సాధించాలి నెహ్రూ ఘన నివాళి

శ్రీనివాసనగర్‌లో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ.. పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ

Select Suryaa Now
శ్రీనివాసనగర్‌లో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ.. పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ

సూర్య - మానకొండూర్ :మానకొండూరు మండలం శ్రీనివాసనగర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి కొబ్బరికాయ సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యేకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శ్రీనివాసనగర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ఈ గ్రామమంతా సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. వ్యవసాయం బాగుండాలని, ఎల్ నినో  ప్రభావం తగ్గి సమృద్ధిగా వర్షాలు కురవాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అమ్మవారి ఆశీర్వచనాలు నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ముదిరాజ్ సోదరులందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కలికోట విజయకుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేవెల్లి రాజలింగం, గ్రామ సర్పంచ్ ఎరుకల శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ద్యావ శ్రీనివాస్ రెడ్డి,ఏఎంసి మాజీ వైస్ చైర్మన్ రామిడి తిరుమల్ రెడ్డి,ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పురం శంకర్ ముదిరాజ్, ఉపాధ్యక్షులు కూన చంద్రయ్య, ప్రధాన కార్యదర్శి అనవేని కుమార్, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు కూన శంకర్, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఉపాధ్యక్షులు కూన రమేష్ , మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ప్రధాన కార్యదర్శి అనవేని రాజు,మానకొండూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎరవేణి రామాంజనేయ, తదితరులు పాల్గొన్నారు...