BREAKING
నామినేషన్లలో నిబంధనలు ఉల్లంఘిస్తే సహించేది లేదు : కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం డ్రైనేజీ సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలి : కలెక్టర్ డీకే బాలాజీ కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి పర్యటనకు పకడ్బందీ భద్రత, ప్రోటోకాల్ ఏర్పాట్లు చేయాలి మేరా యువ భారత్ యూత్ వాలంటీర్‌గా సాయి వంశీ గౌడ్ ఎంపిక సుధాకర్స్ ఐడియల్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు ఘనంగా బాలల దినోత్సవం శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ ధర్మశాస్త్ర స్వామివారి హోమం శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ ధర్మశాస్త్ర స్వామివారి హోమం జనగణన 2027 జనాభా లెక్కింపును అత్యంత కచ్చితత్వంతో నిర్వహించాలి విద్యార్థులు సాంస్కృతిక పోటీల్లో రాణించాలి గ్రామ పంచాయతీ ఎన్నికల వ్యయ నిర్వహణలో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలి పాల్వంచలో ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు నవంబర్ 16వ తేదీ నుంచి ఎరువుల పంపిణీకి నూతన విధానం అమలు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు చేయూత

ప్రమాదాలకు నిలయంగా ఎల్కతుర్తి–సిద్దిపేట జాతీయ రహదారి ఇంకెన్ని ప్రాణాలు బలికావాలి? రక్షణ చర్యలు చేపట్టేది ఎప్పుడు?

Select Suryaa Now
ప్రమాదాలకు నిలయంగా ఎల్కతుర్తి–సిద్దిపేట జాతీయ రహదారి  ఇంకెన్ని ప్రాణాలు బలికావాలి? రక్షణ చర్యలు చేపట్టేది ఎప్పుడు?

హుస్నాబాద్ ;  ఎల్కతుర్తి–సిద్దిపేట జాతీయ రహదారిపై ప్రయాణమంటేనే వాహనదారులు, ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. నిమిషం నిమిషం ఏం జరుగుతుందోనన్న భయంతో ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. తరచూ చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు ప్రజల ప్రాణాలను బలిగొంటున్నా సంబంధిత నేషనల్ హైవే అధికారుల నుంచి తగిన రక్షణ చర్యలు కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.రహదారిపై ప్రమాదకర మలుపులు, హెచ్చరిక బోర్డులు, సూచికలు, అవసరమైన భద్రతా ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కాకుండా, ప్రమాదాలు జరగకముందే నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.ఇప్పటికే ఎన్నో ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో అధికారులు ఇంకా ఎంతకాలం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు? మరెన్ని కుటుంబాలు రోడ్డుప్రమాదాల్లో తమ ఆత్మీయులను కోల్పోవాలి? ప్రజల ప్రాణాలకు విలువ లేదా? అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి.ఇప్పటికైనా నేషనల్ హైవే అధికారులు స్పందించి ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, హెచ్చరిక బోర్డులు, రేడియం సూచికలు, లైటింగ్, అవసరమైన రక్షణ బారికేడ్లు ఏర్పాటు చేయాలి. రహదారి భద్రతపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలి. మరో ప్రాణం పోయిన తర్వాత స్పందించడం కాదు.. ప్రాణాలు పోకుండా కాపాడటమే అధికారుల బాధ్యత!