telangana
మండలంలో విస్తృతంగా పర్యటించిన బీజేపీఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
సూర్య,సారంగాపూర్ : మండలంలో బీజేపీఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గురువారం రోజు విస్తృతంగా పర్యటించారు.మండలంలోని ఆలూరు గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.అనంతరం మండల కేంద్రంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 83 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.83,09,628 విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించుకునేలా అవసరమైన సదుపాయాలు కల్పించాలని సూచించారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా,వేగవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మల్ నియోజకవర్గంలో మొత్తం 89 గోదాములు మంజూరైనట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కాల్వ నరేష్, ఆయా గ్రామాల సర్పంచ్లు స్థానిక ప్రజాప్రతినిధులు,బీజేపీ నాయకులు, రైతులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.