చేజర్ల వెంకటేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కార్పొరేటర్ ఉచ్చు భువనేశ్వర ప్రసాద్
నెల్లూరు, మేజర్ న్యూస్ : ఇటీవల జరిగిన నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి పార్టీల మద్దతుతో తెలుగుదేశం పార్టీ తరఫున 22వ డివిజన్ కార్పొరేటర్‌గా ఘన విజయం సాధించిన రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఉచ్చు భువనేశ్వర ప్రసాద్, నెల్లూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చేజర్ల వెంకటేశ్వర రెడ్డిని శాలువాతో సత్కరించి తన గెలుపు సందర్భంగా అభినందనలు స్వీకరించారు. అనంతరం చేజర్ల వెంకటేశ్వర రెడ్డి కూడా ఉచ్చు భువనేశ్వర ప్రసాద్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి, కార్పొరేటర్‌గా ఎన్నికైనందుకు అభినందనలు తెలియజేశారు.