స్థలం విషయంలో మహిళపై దాడి
స్థలం విషయంలో మహిళపై దాడి
పుట్లూరు, మేజర్ న్యూస్: మండలంలోని సూరేపల్లి గ్రామంలో ఇంటి సమీపంలోని స్థలం విషయంలో ఓ మహిళపై దాడి జరిగినట్లు ఎస్‌ఐ సురేంద్రబాబు గురువారం తెలిపారు. గ్రామానికి చెందిన మద్దినేని రమణిపై అదే గ్రామానికి చెందిన మద్దినేని బాలరంగయ్య, భాగ్యలక్ష్మి దాడి చేసినట్లు పేర్కొన్నారు. గతంలో జరిగిన వివాదాలను మనసులో పెట్టుకొని రమణిపై దాడి చేయడంతో ఆమెకు గాయాలైనట్లు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ వెల్లడించారు.