ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డికి స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థి కటారు చిన్న రాజా యాదవ్ మద్దతు
గిద్దలూరు, మేజర్‌న్యూస్ :
పట్టణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది గిద్దలూరు పట్టణంలోని 6వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన కటారు చిన్న రాజా యాదవ్ గారు గౌరవ ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కటారు చిన్న రాజా యాదవ్ గారు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారి నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, గిద్దలూరు పట్టణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఆయనకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పట్టణ అభివృద్ధిలో భాగస్వాములవుతూ, ఎమ్మెల్యే నాయకత్వంలో సమష్టిగా కలిసి ముందుకు సాగుతామని తెలిపారు. అనంతరం వార్డు సభ్యులతో కలిసి ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారిని, ఆయన సోదరుడు శ్రీ ముత్తుముల క్రిష్ణ కిశోర్ రెడ్డి గారిని శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.