BREAKING
జబర్దస్త్ శ్రీవిద్య సంచలన వ్యాఖ్యలు.. కెరీర్ ప్రారంభంలో పడిన కష్టాలు, వైరల్ ఫేమ్ వెనుక అసలు నిజాలు వృత్తి విద్యా ఉపాధ్యాయులకు మూడు రోజుల కౌశల్ బోధ్ శిక్షణ స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం.. వత్సవాయి మండలంలో రెండో విడతకు గ్రామ పంచాయతీ ఎన్నికలు నవంబర్ 29న పోలింగ్.. 18 నుంచి 20 వరకు నామినేషన్ల స్వీకరణ అసత్య ఆరోపణలు వ్యక్తిగత విమర్శలు కాదు.. అభివృద్ధిపై చర్చకు రండి ఎమ్మెల్యే సంజీవరెడ్డి కి మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సవాల్ నయనతారపై టాలీవుడ్ డైరెక్టర్ మారుతి సంచలన వ్యాఖ్యలు.. ఆ స్టార్ హీరోయిన్‌కు అంత పొగరా? విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను తొలగించండి తీపర్రు ఎంపీటీసీ కరటూరి సుబ్బారావుకు బూరుగుపల్లి శేషారావు అభినందనలు దివ్యాంగుల సమస్యలు పరిష్కరించకుంటే మరో ఉద్యమం మృత్యువుకే ఎదురెళ్ళి గెలిచిన వీరనారీమణులు.. క్యాన్సర్‌ను జయించి స్ఫూర్తిగా నిలిచిన హీరోయిన్స్ సొంత పార్టీ ఎంపీ కార్యక్రమానికి వెళ్తే సస్పెండ్ చేస్తారా? ఏకపక్ష సస్పెన్షన్‌ను వెంటనే రద్దు చేయాలి జీబీఆర్‌లో క్రీడా సందడి.. విద్యార్థుల్లో ఉత్సాహం. సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కాట సుధా శ్రీనివాస్ గౌడ్ మెగాస్టార్ చిరంజీవి ‘కాకా’ నైజాం రైట్స్ సంచలనం.. రూ.35 కోట్ల భారీ డీల్‌ను దక్కించుకున్న ఏషియన్ సినిమాస్! కరువు రైతులకు రుణ ఉపశమనం కల్పించాలి! బ్యాంకర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలి..జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీకిరణ్ సూచనలు

కూరగాయల సాగుతో అదనపు ఆదాయం ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి

Select Suryaa Now
కూరగాయల సాగుతో అదనపు ఆదాయం  ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి

 

సూర్య – పెద్దపల్లి రూరల్ :

వాతావరణ మార్పులు, భూగర్భ జలాల తగ్గుదలను దృష్టిలో ఉంచుకొని రైతులు తక్కువ నీటి వినియోగంతో అధిక ఆదాయం ఇచ్చే కూరగాయల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ఉద్యానశాఖాధికారి గడ్డం శ్యామ్ ప్రసాద్ సూచించారు.
గురువారం పెద్దపల్లి మండలం హన్మంతునిపేటలో రైతు గౌరవెల్లి రవీందర్ రావుకు చెందిన 4.5 ఎకరాల ఆయిల్‌పామ్ తోటలో అంతర పంటలుగా సాగు చేస్తున్న టమాటా, మిరప పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూగర్భ జలాలు తగ్గుతున్న నేపథ్యంలో అధిక నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా బెండ, అలసంద, గోరుచిక్కుడు వంటి కూరగాయలు సాగు చేయాలన్నారు. డ్రిప్ ఇరిగేషన్, మల్చింగ్ పద్ధతులతో టమాటా, పచ్చిమిర్చి, బీరకాయ, కాకరకాయ సాగు చేసి మంచి ఆదాయం పొందవచ్చన్నారు. ఈ పద్ధతులకు ప్రభుత్వం ఉద్యానశాఖ ద్వారా రాయితీలు అందిస్తోందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో ఉద్యాన విస్తరణ అధికారి రాము, రైతులు పాల్గొన్నారు.