BREAKING
గ్రంథాలయ వారోత్సవాల గోడ పత్రిక ఆవిష్కరణ కృత్రిమ మేధ పరిణామాలపై ఐఎంఎఫ్ నిరంతర నిఘా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి "ఎస్. వి. సి.టి" చేయూత జర్మనీలో పెట్టుబడులకు మెర్సిడెస్ బెంజ్ బ్రేక్ ఐపీఎల్ 2027 వేలానికి ముందు సీఎస్‌కే ఆటగాడిపై ఎస్‌ బద్రినాథ్ సంచలన వ్యాఖ్యలు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై స్టేజ్‌–1 ఆర్‌ఓలకు శిక్షణ.. జోన్స్ చట్టం మినహాయింపును పొడిగించే యోచనలో వైట్ హౌస్ ఆ...అధికారుల పేర్లు డిజిటల్ బుక్‌లో నమోదు శిమ్మ రాజశేఖర్ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలి మాజీ సైనికుల మానసిక ఆరోగ్యంపై అమెరికా ప్రత్యేక దృష్టి ప్రపంచ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉంది 2.2 బిలియన్ డాలర్ల రుణ ప్యాకేజీ ఆమోదం పొందాలంటే బడ్జెట్ చట్టాన్ని అమలు చేయాల్సిందే వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి పరామర్శించిన యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు కేవలం రెండే రెండు తెలుగు సినిమాలలో నటించిన ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తున్నారా? శత్రుచర్ల విజయరామరాజు మృతి పట్ల మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తీవ్ర దిగ్భ్రాంతి

తీపర్రు ఎంపీటీసీ కరటూరి సుబ్బారావుకు బూరుగుపల్లి శేషారావు అభినందనలు

Select Suryaa Now
తీపర్రు ఎంపీటీసీ కరటూరి సుబ్బారావుకు బూరుగుపల్లి శేషారావు అభినందనలు

                రానున్న పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి విజయమే లక్ష్యంగా పనిచేయాలి: శేషారావు

పెరవలి మేజర్ న్యూస్ :తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం తీపర్రు గ్రామంలో ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన కరటూరి సుబ్బారావు నవంబర్ 12వ తేదీ గురువారం స్థానిక జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావును మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇదే ఐక్యత, సమన్వయంతో రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ పెరవలి మండలంలోని అన్ని గ్రామాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించే దిశగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ప్రత్తిపాటి ప్రసాద్ కుమార్, మొగలపు సీతారాం, నందమూరి నారాయణరావు, కంటిపూడి సూర్యనారాయణ, సింహాద్రి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.