ఆ...అధికారుల పేర్లు డిజిటల్ బుక్‌లో నమోదు శిమ్మ రాజశేఖర్
శ్రీకాకుళం నవంబర్ 12 మేజర్ న్యూస్:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా డిజిటల్ బుక్ చైర్మన్ శిమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ, ఇటీవల (07.11.2026) జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా శ్రీకాకుళం మండలంలో కొందరు అధికారులు అన్యాయంగా వ్యవహరించారని తెలిపారు.
శ్రీకాకుళం మండలంలో ఎన్నికల అధికారిగా విధులు నిర్వహించిన మెప్మా పీడీ శ్రీమతి బొడ్డేపల్లి శైలజ చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ తన విధులను, అధికారాలను దుర్వినియోగం చేశారని తెలిపారు. అధికార పార్టీ ప్రయోజనాలను కాపాడేందుకు, ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే విధంగా, వాస్తవంగా గెలిచిన అభ్యర్థులకు బదులుగా ఓడిపోయిన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె పేరును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన డిజిటల్ బుక్‌లో నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
అదేవిధంగా ఎన్నికల విధుల్లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించిన కింది అధికారుల పేర్లను కూడా డిజిటల్ బుక్‌లో చేరుస్తున్నట్లు వెల్లడించారు. మెప్మా పీడీ బొడ్డేపల్లి శైలజ, ఎంపీడీవో వెంకుమహంతి ప్రకాష్ (ఏఆర్వోగా వ్యవహరించిన అధికారి, డిప్యూటీ ఎంపీడీవో కనిత సూర్యనారాయణ, ఏఆర్వోగా వ్యవహరించిన శ్రీకాకుళం తహసీల్దార్ గణపతిరావు డిప్యూటీ ఎంపీడీవో కణితి సూర్యనారాయణ. మండల లెవెల్ మాస్టర్ ట్రైనర్‌గా విధులు నిర్వహించిన బలివాడి సూర్యనారాయణ.
ఎన్నికల విధుల నిర్వహణలో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించడం ప్రతి అధికారి బాధ్యత అని శిమ్మ రాజశేఖర్ పేర్కొన్నారు.