గ్రంథాలయ వారోత్సవాల గోడ పత్రిక ఆవిష్కరణ
నర్సీపట్నం నవంబర్ 12 మేజర్ న్యూస్:నర్సీపట్నం శాఖ గ్రంథాలయంలో తేది 14-11-2026 నుండి 20-11-2026 వరకు జరగనున్న గ్రంథాలయ వారోత్సవాల గోడ పత్రికను గ్రంథాలయ అధికారిని పి దమయంతి పాఠకులు విద్యార్థులతో ప్రదర్శించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (మెయిన్), ప్రభుత్వం ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికలు), తురకబడి, మాంటిస్సోరి ఉన్నత పాఠశాలలకు, ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలికలు), ప్రభుత్వ జూనియర్ కళాశాల, నీలం పేట మరియు రిషి జూనియర్ కళాశాలలకు గ్రంథాలయ వారోత్సవాల గోడ పత్రికను అందించి, విద్యార్థులకు నిర్వహించే కార్యక్రమాలకు విద్యార్థులను పంపి, కార్యక్రమములను విజయవంతం చేయడానికి సహకరించవలసిందిగా దమయంతి కోరారు.