BREAKING
మీర్జాపూర్ విజయపు ఒత్తిడిని అసలు తీసుకోను.. నటి శ్వేతా త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు క్యాన్సర్ ముప్పును దూరం చేసే అద్భుతమైన ఆరోగ్య అలవాట్లు.. నిపుణులు ఏం చెబుతున్నారు? న్యూజిలాండ్ గడ్డపై భారత ఫుట్‌బాల్ జట్టుకు ఘోర పరాభవం.. తొలి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో కివీస్ జయభేరి దర్శకుడిగా మారిన రవి మోహన్.. యోగి బాబు హీరోగా 'ఆన్ ఆర్డినరీ మన్' నుంచి కొత్త సాంగ్ రిలీజ్ దిగ్గజ నటుడు పద్మశ్రీ మధుకు అరుదైన గౌరవం.. ప్రథమ బిచ్చు తిరుమల పురస్కారం ప్రకటన భోజనం చేస్తూ స్మార్ట్‌ఫోన్ వాడే అలవాటు ఉందా.. అయితే ఈ తీవ్రమైన అనారోగ్య సమస్యలు తప్పవు 'పరిషత్' పీఠాలపై పరోక్ష పోరు! అభాగ్యులకు అండగా సేవా సంస్థలు! పుస్తకాలు చదవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే ప్రశాంత ఎన్నికలకు సహకరించండి... డిఎస్పి రాఘవులు వైకాపా నుండి తెదేపాలో చేరిన 50 కుటుంబాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా.. రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ నియంత్రణతో ముప్పుకు చెక్ పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నిషేదిద్దాం గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయండి : 19న మండలపరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక

ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలి

Select Suryaa Now
ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలి

 

శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలి

నామినేషన్, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల్లో సీసీటీవీ నిఘా తప్పనిసరి

స్థానిక ఎన్నికల పరోక్ష ఎన్నికలకు షెడ్యుల్ విడుదల చేసాం

స్థానిక ఎన్నికల మొదటి,రెండవ, మూడవ విడత నోటిఫికెషన్లు జారి చేస్తాం

కలెక్టర్లు, ఎస్పీలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పూనేఠా ఆదేశాలు

శ్రీకాకుళం, నవంబరు, 12 మేజర్ న్యూస్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పూనేఠా ఆదేశించారు. జిల్లా  కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లు సమన్వయంతో పనిచేస్తూ అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలన్నారు.   స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరం నుండి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గతంలో కొన్ని జిల్లాల్లో, ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియను మరింత క్రమబద్ధంగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టం చేశారు. రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వెల్లడించారు.
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 13న, రెండవ విడత నవంబర్ 16న, మూడవ విడత నవంబర్ 19న విడుదల చేయనున్నట్లు కమిషనర్ వెల్లడించారు. మొదటి విడత పోలింగ్ నవంబర్ 26న నిర్వహించి,  రెండో దశ లో నవంబర్ 29 తేదీన, మూడో దశ లో డిసెంబర్ 2న పోలింగ్ నిర్వహించి, ఆయా రోజుల్లో కౌంటింగ్ చేపట్టనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు నామినేషన్ పత్రాలను ఆన్‌లైన్‌లో దాఖలు చేసే అవకాశం ప్రస్తుతం అందుబాటులో లేనందున, నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని, అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం నామినేషన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరాలు లేదా వీడియోగ్రఫీ ఏర్పాటు చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం పూర్తయ్యే వరకు లేదా కనీసం 60 రోజుల పాటు వీడియో రికార్డులను భద్రపరచాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశను పారదర్శకంగా నిర్వహించేందుకు నిఘా వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.  రాష్ట్ర ఎన్నికల కార్యదర్శి మల్లిఖార్జున్ వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి లక్షా 36 వేలకు పైగా పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో 200 కంటే తక్కువ ఓటర్లు ఉన్న పోలింగ్ స్టేషన్లు సుమారు 77, 200 నుంచి 400 మంది ఓటర్లు ఉన్న పోలింగ్ స్టేషన్లు సుమారు 29,000, 401 నుంచి 650 మంది ఓటర్లు ఉన్న పోలింగ్ స్టేషన్లు సుమారు 10,185 ఉన్నట్లు వివరించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో పోలింగ్ స్టేషన్‌కు గరిష్టంగా 650 మంది ఓటర్లు ఉండే విధంగా ఏర్పాట్లు ఉన్నట్లు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీటీవీ లేదా వీడియోగ్రఫీ ఏర్పాటు చేసి, ఎన్నికల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని, సుప్రీంకోర్టు సూచనలు, మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. పరోక్ష ఎన్నికల నిర్వహణ తేదీలు వివరాలు తెలుపుతూ పట్టణ స్థానిక సంస్థలైన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి పరోక్ష ఎన్నికలను నవంబర్ 23న నిర్వహించనున్నట్లు తెలిపారు. మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలకు నవంబర్ 19వ తేదీని, జెడ్పీటీసీ చైర్మన్ ఎన్నికకు నవంబర్ 21వ తేదీని నిర్ణయించినట్లు వివరించారు. గ్రామీణ స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీలలో ఎక్స్-అఫీషియో సభ్యులకు ఓటింగ్ హక్కు ఉండదని రాష్ట్ర ఎన్నికల కార్యదర్శి స్పష్టం చేశారు. పట్టణ స్థానిక సంస్థలైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎంపీలు, ఎమ్మెల్యేలు తాము ఓటరుగా నమోదైన వార్డుకు సంబంధించి ఎక్స్-అఫీషియో సభ్యులుగా గుర్తింపు పొంది ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుందని వివరించారు. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల అధికారులు, పోలీసు యంత్రాంగం పూర్తి సమన్వయంతో పనిచేయాలని, ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేస్తూ ఓటర్లకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సూచించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు ప్రణాళికతో అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఈ వీడియో కాన్పెనెన్సులో  రాష్ట్ర ఎన్నికల సెక్రటరి మల్లిఖార్జున్, ఐ.జి. రాజకుమారి, జిల్లా నుండి జిల్లా ఎన్నికల అదికారి, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ కె.వి. మహేశ్వర రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, జిల్లా పంచాయతీ అధికారి  స్వరూప రాణి , శ్రీకాకుళం, ఆమదాలవలస మున్సిపల్ కమిషనర్ లు జి. శ్రావణ్ కుమార్, తమ్మినేని రవి, డి ఎస్ పి సి. హెచ్. ధనుంజయ నాయుడు, తదితరులు, పాల్గొన్నారు.