పంచాయతీ ఎన్నికల నిర్వహణపై స్టేజ్–1 ఆర్‌ఓలకు శిక్షణ..
నరసన్నపేట నవంబర్ 12 మేజర్ న్యూస్ : పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు అధికారులకు అవగాహన కల్పించారు.నరసన్నపేట మండల కేంద్రంలో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల స్టేజ్–1 ఆర్‌ఓల శిక్షణ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి–1 ఉప్పాడ శాంతారావు, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీవో వెంకటేశ్వర ప్రసాద్, ఏపీఎం యుగంధర్, డిప్యూటీ ఎంపీడీవో జగన్ మోహనరావు పాల్గొని ఎన్నికల విధివిధానాలపై వివరించారు.
ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు పోషించాల్సిన పాత్ర, ఎన్నికల నియమావళి అమలు, పోలింగ్ ప్రక్రియ, ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాధ్యతల నిర్వహణ తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఎన్నికల విధుల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిబంధనలను పూర్తిస్థాయిలో అవగాహన చేసుకొని విధులు నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంఓటీలు బి. శ్రీరామమూర్తి, బి. మన్మధరావు, బి. విశాలాక్షితో పాటు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు.