BREAKING
ఉత్తరాంధ్ర టైగర్ శత్రుచర్ల విజయరామరాజు మరణం తీరని లోటు కరుటూరి శ్రీహరి బాబుకు జగన్ అభినందనలు ప్రపంచ న్యూమోనియా దినోత్సవం శీతాకాలంలో సీతాఫలం తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. ఆ సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు! భారత జనగణన–2027 ఫేజ్-II ఫీల్డ్ ట్రైనర్ల శిక్షణ ప్రారంభం రౌడీషీటర్ అరెస్ట్, 14 రోజుల రిమాండ్. గూడ్స్ వాహనాల యజమానులు సమ్మె సైకిల్ పై 12 జ్యోతిర్లింగాల యాత్ర! ధర్మవరంలో తుఫాను బాధితులకు అండగా ప్రభుత్వం! సరదా ఈత విగతజీవులుగా మారిన విద్యార్థులు! కోమీర సర్పంచ్ పోటీకి బిజెపికి కేటాయించాలి సెలవుల్లో ఉన్న సర్వీస్ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం పంచాయతీకి తెలియజేయాలి భర్త మరణంతో కష్టాల్లో ఉన్న కుటుంబానికి రూ.2 లక్షల బీమా సాయం మేయర్ శ్రావణికి బుద్ధ నాగ జగదీష్ అభినందనలు. బంగారం చోరీ కేసులో నిందితుడి అరెస్టు.

వత్సవాయి మండలంలో రెండో విడతకు గ్రామ పంచాయతీ ఎన్నికలు నవంబర్ 29న పోలింగ్.. 18 నుంచి 20 వరకు నామినేషన్ల స్వీకరణ

Select Suryaa Now
వత్సవాయి మండలంలో రెండో విడతకు గ్రామ పంచాయతీ ఎన్నికలు  నవంబర్ 29న పోలింగ్.. 18 నుంచి 20 వరకు నామినేషన్ల స్వీకరణ

వత్సవాయి: ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలుకానుంది. నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల పరిధిలోని గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండో విడత (ఫేజ్‌–2)లో నిర్వహించనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది.

నవంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నవంబర్ 21న నామినేషన్ల పరిశీలన, నవంబర్ 24న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుంది. నవంబర్ 29న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

రెండో విడత ఎన్నికల నేపథ్యంలో వత్సవాయి మండలంలోని గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు.