BREAKING
మీర్జాపూర్ విజయపు ఒత్తిడిని అసలు తీసుకోను.. నటి శ్వేతా త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు క్యాన్సర్ ముప్పును దూరం చేసే అద్భుతమైన ఆరోగ్య అలవాట్లు.. నిపుణులు ఏం చెబుతున్నారు? న్యూజిలాండ్ గడ్డపై భారత ఫుట్‌బాల్ జట్టుకు ఘోర పరాభవం.. తొలి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో కివీస్ జయభేరి దర్శకుడిగా మారిన రవి మోహన్.. యోగి బాబు హీరోగా 'ఆన్ ఆర్డినరీ మన్' నుంచి కొత్త సాంగ్ రిలీజ్ దిగ్గజ నటుడు పద్మశ్రీ మధుకు అరుదైన గౌరవం.. ప్రథమ బిచ్చు తిరుమల పురస్కారం ప్రకటన భోజనం చేస్తూ స్మార్ట్‌ఫోన్ వాడే అలవాటు ఉందా.. అయితే ఈ తీవ్రమైన అనారోగ్య సమస్యలు తప్పవు 'పరిషత్' పీఠాలపై పరోక్ష పోరు! అభాగ్యులకు అండగా సేవా సంస్థలు! పుస్తకాలు చదవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే ప్రశాంత ఎన్నికలకు సహకరించండి... డిఎస్పి రాఘవులు వైకాపా నుండి తెదేపాలో చేరిన 50 కుటుంబాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా.. రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ నియంత్రణతో ముప్పుకు చెక్ పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నిషేదిద్దాం గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయండి : 19న మండలపరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక

కరుటూరి శ్రీహరి బాబుకు జగన్ అభినందనలు

Select Suryaa Now
కరుటూరి శ్రీహరి బాబుకు జగన్ అభినందనలు

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంరాజానగరం నియోజక వర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధించిన ఫలితాలపై పార్టీ అధి నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందిం చారు. మాజీ ఎమ్మెల్యే, రాజానగరం నియోజక వర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి జక్కంపూడి రాజా నాయకత్వంలో సీతానగరం జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకోవ డం తో పాటు, జిల్లాలో అత్యధిక ఎంపీటీసీ స్థానా లను రాజానగరం నియో జక వర్గం నుంచి గెలుచు కోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.తాడేపల్లిలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన జక్కంపూడి రాజా, సీతానగరం జడ్పీటీసీగా విజయం సాధించిన కరుటూరి శ్రీహరి బాబు ను జగన్ కి పరిచయం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి వెంకటలక్ష్మిపై 2,637 ఓట్ల మెజారిటీతో  విజయం సాధించిన శ్రీహరి బాబును జగన్ ప్రత్యేకంగా అభినం దించారు.జిల్లావ్యాప్తంగా వైఎస్సా ర్‌సీపీ 68 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకోగా, అందులో ఒక్క రాజాన గరం నియోజకవర్గం నుంచే 30 స్థానాలు సాధించారని జిల్లా అధ్య క్షుడు చెల్లుబోయిన వేణు పేర్కొన్నారు. రాజా నాయకత్వం పట్టిమ కు సాధించిన ఫలితాలే నిదర్శనం అన్నారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీ గెలుచుకున్న జడ్పీటీసీ స్థానాల్లో సీతానగరం ఒక్కటే కావడం, ఆ స్థానాన్ని కూడా రాజానగరం నియోజక వర్గం కైవసం చేసుకోవడం ప్రాధాన్యత సంతరిం చుకుందన్నారు.అధికార కూటమి నుంచి ఎదురైన రాజకీయ పోటీ, ఎన్నికల సమయంలో నెలకొన్న పరిస్థితులను ఎదుర్కొం టూ అభ్యర్థుల గెలుపు కోసం జక్కంపూడి రాజా నాయకత్వంలో పార్టీ శ్రేణులు చేసిన కృషిని జగన్ అభినందించారు.