ధర్మవరంలో తుఫాను బాధితులకు అండగా ప్రభుత్వం!
సరుకుల పంపిణీ చేసిన తహసీల్దార్ రమేష్ బాబు
ఎస్.రాయవరం, నవంబర్ 12, మేజర్ న్యూస్:
ఎస్. రాయవరం మండలం ధర్మవరం గ్రామంలో తుఫాను బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన నిత్యావసర సరుకుల పంపిణీని గురువారం పూర్తి చేశారు. గ్రామంలోని చౌకధరల దుకాణం నం.27 లో లబ్ధిదారులకు కందిపప్పు, పామాయిల్ లను ఎస్.రాయవరం తహసిల్దార్ జె.రమేష్ బాబు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహసిల్దార్ రమేష్ బాబు మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు తుఫాను వల్ల నష్టపోయిన ప్రతి అర్హులైన కుటుంబానికి ప్రభుత్వ సహాయక సరుకులు అందేలా చర్యలు తీసుకున్నామని, పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ సిబ్బంది పర్యవేక్షణలో పంపిణీ చేశామని తెలిపారు. కార్యక్రమంలో పౌరసరఫరాల సిబ్బంది, ఎఫ్.పి.షాపు డీలర్, గ్రామ పెద్దలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.