గూడ్స్ వాహనాల యజమానులు సమ్మె
మాకవరపాలెం, నవంబర్ 12, మేజర్ న్యూస్:
దేశవ్యాప్తంగా వాణిజ్య వాహన డ్రైవర్లు చేపట్టిన స్టీరింగ్ ఛోడో ఆందోళనకు మద్దతుగా మాకవరపాలెంలో గూడ్స్ వాహనాల యజమానులు గురువారం సమ్మె నిర్వహించారు. శ్రీ కనకదుర్గ మినీ గూడ్స్ వెహికల్స్ ఓనర్స్, డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాహనాలను నిలిపివేసి నిరసన తెలిపారు. దేశవ్యాప్తంగా డ్రైవర్లు స్టీరింగ్ వదిలి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో వారికి సంఘీభావంగా స్థానికంగా కూడా గూడ్స్ వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు సంఘం అధ్యక్షుడు పోతల నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి రుత్తల రవికుమార్, రుత్తల నాగేష్ తదితరులు పాల్గొన్నారు.