BREAKING
మీర్జాపూర్ విజయపు ఒత్తిడిని అసలు తీసుకోను.. నటి శ్వేతా త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు క్యాన్సర్ ముప్పును దూరం చేసే అద్భుతమైన ఆరోగ్య అలవాట్లు.. నిపుణులు ఏం చెబుతున్నారు? న్యూజిలాండ్ గడ్డపై భారత ఫుట్‌బాల్ జట్టుకు ఘోర పరాభవం.. తొలి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో కివీస్ జయభేరి దర్శకుడిగా మారిన రవి మోహన్.. యోగి బాబు హీరోగా 'ఆన్ ఆర్డినరీ మన్' నుంచి కొత్త సాంగ్ రిలీజ్ దిగ్గజ నటుడు పద్మశ్రీ మధుకు అరుదైన గౌరవం.. ప్రథమ బిచ్చు తిరుమల పురస్కారం ప్రకటన భోజనం చేస్తూ స్మార్ట్‌ఫోన్ వాడే అలవాటు ఉందా.. అయితే ఈ తీవ్రమైన అనారోగ్య సమస్యలు తప్పవు 'పరిషత్' పీఠాలపై పరోక్ష పోరు! అభాగ్యులకు అండగా సేవా సంస్థలు! పుస్తకాలు చదవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే ప్రశాంత ఎన్నికలకు సహకరించండి... డిఎస్పి రాఘవులు వైకాపా నుండి తెదేపాలో చేరిన 50 కుటుంబాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా.. రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ నియంత్రణతో ముప్పుకు చెక్ పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నిషేదిద్దాం గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయండి : 19న మండలపరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక

భారత జనగణన–2027 ఫేజ్-II ఫీల్డ్ ట్రైనర్ల శిక్షణ ప్రారంభం

Select Suryaa Now
భారత జనగణన–2027 ఫేజ్-II ఫీల్డ్ ట్రైనర్ల శిక్షణ ప్రారంభం

 

అనకాపల్లి ప్రతినిధి, నవంబర్ 12, మేజర్ న్యూస్:
భారత ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్, ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారత జనగణన–2027 (ఫేజ్-II–పాపులేషన్ ఎన్యూమరేషన్) ప్రక్రియలో భాగంగా అనకాపల్లి జిల్లాలో ఫీల్డ్ ట్రైనర్ల శిక్షణా కార్యక్రమం గురువారం అనకాపల్లి ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి వై.ఎస్.వి.కె.జి.ఎస్.ఎల్. సత్యనారాయణ రావు హాజరై శిక్షణ పొందుతున్న ఫీల్డ్ ట్రైనర్లకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగణన దేశ అభివృద్ధి ప్రణాళికలు, విధానాల రూపకల్పనకు అత్యంత కీలకమైన సమాచారాన్ని అందిస్తుందని తెలిపారు. జనగణన ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా క్షేత్రస్థాయిలో కచ్చితత్వంతో గణన జరిగేలా ఫీల్డ్ ట్రైనర్లు సమర్థవంతంగా శిక్షణ పొందాలని సూచించారు. అనంతరం ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు జనగణన విధివిధానాలపై సమగ్ర అవగాహన కల్పించేలా శిక్షణ అందించాలని పేర్కొన్నారు.
జిల్లాలో ఫీల్డ్ ట్రైనర్ల శిక్షణను రెండు బ్యాచ్‌లుగా నిర్వహిస్తున్నారు. మొదటి బ్యాచ్‌కు నవంబరు 12 నుంచి 14వ తేదీ వరకు, రెండవ బ్యాచ్‌కు నవంబరు 16 నుంచి 18వ తేదీ వరకు అనకాపల్లి ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో శిక్షణ కొనసాగనుంది.
శిక్షణ పూర్తి చేసుకున్న ఫీల్డ్ ట్రైనర్లు అనంతరం జిల్లాలోని ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు జనగణన–2027 ఫేజ్-IIకి సంబంధించిన విధివిధానాలు, మార్గదర్శకాలు మరియు క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన ప్రక్రియలపై శిక్షణ అందించనున్నారు.ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఆర్డీవో శ్రీనివాసరావు, జనగణన విభాగం అధికారులు, మండల స్థాయి సిబ్బంది, ఫీల్డ్ ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు.