BREAKING
మీర్జాపూర్ విజయపు ఒత్తిడిని అసలు తీసుకోను.. నటి శ్వేతా త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు క్యాన్సర్ ముప్పును దూరం చేసే అద్భుతమైన ఆరోగ్య అలవాట్లు.. నిపుణులు ఏం చెబుతున్నారు? న్యూజిలాండ్ గడ్డపై భారత ఫుట్‌బాల్ జట్టుకు ఘోర పరాభవం.. తొలి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో కివీస్ జయభేరి దర్శకుడిగా మారిన రవి మోహన్.. యోగి బాబు హీరోగా 'ఆన్ ఆర్డినరీ మన్' నుంచి కొత్త సాంగ్ రిలీజ్ దిగ్గజ నటుడు పద్మశ్రీ మధుకు అరుదైన గౌరవం.. ప్రథమ బిచ్చు తిరుమల పురస్కారం ప్రకటన భోజనం చేస్తూ స్మార్ట్‌ఫోన్ వాడే అలవాటు ఉందా.. అయితే ఈ తీవ్రమైన అనారోగ్య సమస్యలు తప్పవు 'పరిషత్' పీఠాలపై పరోక్ష పోరు! అభాగ్యులకు అండగా సేవా సంస్థలు! పుస్తకాలు చదవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే ప్రశాంత ఎన్నికలకు సహకరించండి... డిఎస్పి రాఘవులు వైకాపా నుండి తెదేపాలో చేరిన 50 కుటుంబాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా.. రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ నియంత్రణతో ముప్పుకు చెక్ పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నిషేదిద్దాం గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయండి : 19న మండలపరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక

సైకిల్ పై 12 జ్యోతిర్లింగాల యాత్ర!

Select Suryaa Now
సైకిల్ పై 12 జ్యోతిర్లింగాల యాత్ర!

 

అడ్డరోడ్డులో ఆధ్యాత్మిక యాత్రికుడు

ఎస్.రాయవరం, నవంబర్ 12, మేజర్ న్యూస్:
నాసిక్ నుంచి కన్యాకుమారి వరకు 12 జ్యోతిర్లింగాలు, 12 శక్తిపీఠాలు, నాలుగు ధామాల దర్శన లక్ష్యంతో సైకిల్ యాత్ర చేస్తున్న ఓ వృద్ధ యాత్రికుడు గురువారం అనకాపల్లి జిల్లా అడ్డరోడ్డు జంక్షన్ మీదుగా ప్రయాణం సాగించారు. ఈ సందర్భంగా ఆ వృద్ధ యాత్రికుడు విజయ్ మర్సాలె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, 2025 జులై 16న మహారాష్ట్రలోని నాసిక్ లో తన యాత్రను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకు మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్, ఘృష్ణేశ్వర్, భీమశంకర్, మధ్యప్రదేశ్ లోని ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్, గుజరాత్ లోని సోమనాథ్, నాగేశ్వర్, ద్వారకాధామ్, రాజస్థాన్ లోని ఏకలింగ్‌నాథ్, శ్రీనాథ్‌జీ, చార్‌భుజా, సాలాసర్ బాలాజీ, ఖాటూ శ్యామ్, మెహందీపూర్ బాలాజీ, ఉత్తరప్రదేశ్ లోని కాశీ విశ్వనాథ్, జార్ఖండ్ లోని వైద్యనాథ్, ఉత్తరాఖండ్ చార్ ధామ్ లైన యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్, నేపాల్ లోని పశుపతినాథ్, ముక్తినాథ్, ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయాల దర్శనం పూర్తి చేసుకున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 10 జ్యోతిర్లింగాలు, 10 శక్తిపీఠాల దర్శనం పూర్తయిందని, మిగిలిన శ్రీశైలం మల్లికార్జున, రామేశ్వర జ్యోతిర్లింగాల దర్శనానికి దక్షిణాదికి బయలుదేరానని వాటితో పాటు మార్గమధ్యలో వున్నా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలనూ దర్శిస్తూ సైకిల్ యాత్ర చేస్తానని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికి తాను యాత్ర ప్రారంభించి 16 మాసాలు అయిందని, మరో మూడు నెలల్లో ఈ ఆధ్యాత్మిక యాత్ర పూర్తవుతుందని యాత్రికుడు తెలియజేసారు. కన్యాకుమారి తో తన యాత్ర పూర్తవుతున్నప్పటికీ మహారాష్ట్ర కొల్హాపూర్ లోని మహాలక్ష్మి దర్శనం తో తాను ఇంటికి నాసిక్ చేరుకుంటానన్నారు.

నాసిక్ లోని ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీవిరమణ అనంతరం ఈ ఆధ్యాత్మిక యాత్ర ఆరంభించానన్నారు. ప్రతీ వ్యక్తికీ ఆధ్యాత్మికత అవసరమని, ఆరోగ్యం... ఆధ్యాత్మికత రెండూ ఆ దేవ దేవుని దయవల్ల పుష్కళంగా ఉండటంతో తానీ యాత్ర చేస్తున్నానని విజయ్ మర్సాలే చెప్పుకొచ్చారు.