BREAKING
క్యాన్సర్ ముప్పును దూరం చేసే అద్భుతమైన ఆరోగ్య అలవాట్లు.. నిపుణులు ఏం చెబుతున్నారు? న్యూజిలాండ్ గడ్డపై భారత ఫుట్‌బాల్ జట్టుకు ఘోర పరాభవం.. తొలి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో కివీస్ జయభేరి దర్శకుడిగా మారిన రవి మోహన్.. యోగి బాబు హీరోగా 'ఆన్ ఆర్డినరీ మన్' నుంచి కొత్త సాంగ్ రిలీజ్ దిగ్గజ నటుడు పద్మశ్రీ మధుకు అరుదైన గౌరవం.. ప్రథమ బిచ్చు తిరుమల పురస్కారం ప్రకటన భోజనం చేస్తూ స్మార్ట్‌ఫోన్ వాడే అలవాటు ఉందా.. అయితే ఈ తీవ్రమైన అనారోగ్య సమస్యలు తప్పవు 'పరిషత్' పీఠాలపై పరోక్ష పోరు! అభాగ్యులకు అండగా సేవా సంస్థలు! పుస్తకాలు చదవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే ప్రశాంత ఎన్నికలకు సహకరించండి... డిఎస్పి రాఘవులు వైకాపా నుండి తెదేపాలో చేరిన 50 కుటుంబాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా.. రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ నియంత్రణతో ముప్పుకు చెక్ పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నిషేదిద్దాం గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయండి : 19న మండలపరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక పేగుల ఆరోగ్యం మరియు మంచి బ్యాక్టీరియా ప్రాముఖ్యత.. రోగనిరోధక శక్తిని పెంచే రహస్యాలు ఇవే

ప్రపంచ న్యూమోనియా దినోత్సవం

Select Suryaa Now
ప్రపంచ న్యూమోనియా దినోత్సవం

 

పిల్లల్లో న్యూమోనియా లక్షణాలు గుర్తించాలి : డిఎంహెచ్ఓ డా. విజయలక్ష్మి

పార్వతీపురం, నవంబర్12 : మేజర్ న్యూస్ :
పిల్లల్లో న్యుమోనియా లక్షణాలు గుర్తించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి. విజయలక్ష్మి సూచించారు. ప్రపంచ న్యూమోనియా దినోత్సవం సందర్భంగా జిల్లా ఆరోగ్య కార్యాలయంలో గురువారం అవగాహన కార్యక్రమo నిర్వహించారు. కార్యక్రమంలో డిఎమ్.హెచ్ఓ మాట్లాడుతూ ఐదేళ్ల లోపు పిల్లలలో వచ్చే శ్వాస సంబంధమైన వ్యాధులు, ముఖ్యంగా న్యూమోనియా వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. న్యూమోనియా ను ముందుగానే లక్షణాలతో సులభంగా గుర్తించవచ్చని పిల్లలు వేగంగా శ్వాస తీసుకోవడం, శ్వాస తీసుకునేటప్పుడు ఛాతి లోపలికి పోవడం, పాలు, ఆహారం తీసుకోకపోవడం. నేటి నుండి వైద్య సిబ్బంది  సర్వే చేసి ఐదేళ్ల లోపు పిల్లల్లో లక్షణాలుంటే గుర్తించాలని, వివరాలు శాన్స్ (SAANS) యాప్ లో నమోదు చేయాలని ఆదేశించారు. కార్యక్రమాన్ని ఫిబ్రవరి నెలాఖరు వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తగా వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో పి.సి.వి టీకా శిశువులకు పుట్టిన 6 వారాలు, 14 వారాలు, 9 నెలలకు తప్పనిసరిగా వేయాలన్నారు. ఈ వ్యాధి పట్ల క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది సమన్వయంతో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.ఈ కార్యక్రమంలో డిఐఓ డా. వై. విజయ్ మోహన్, ఆర్.బి.ఎస్.కె పిఓ డా. టి. జగన్ మోహన్ రావు, డిపిఎంఓ డా. ఎం. రవికుమార్ రెడ్డి, డిఎంఓ సూర్యనారాయణ, డా. సూర్య కౌశిక్ , డా. వెంకటేష్, డా. రాజేష్, డా. రమణ కుమార్, మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.