BREAKING
మీర్జాపూర్ విజయపు ఒత్తిడిని అసలు తీసుకోను.. నటి శ్వేతా త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు క్యాన్సర్ ముప్పును దూరం చేసే అద్భుతమైన ఆరోగ్య అలవాట్లు.. నిపుణులు ఏం చెబుతున్నారు? న్యూజిలాండ్ గడ్డపై భారత ఫుట్‌బాల్ జట్టుకు ఘోర పరాభవం.. తొలి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో కివీస్ జయభేరి దర్శకుడిగా మారిన రవి మోహన్.. యోగి బాబు హీరోగా 'ఆన్ ఆర్డినరీ మన్' నుంచి కొత్త సాంగ్ రిలీజ్ దిగ్గజ నటుడు పద్మశ్రీ మధుకు అరుదైన గౌరవం.. ప్రథమ బిచ్చు తిరుమల పురస్కారం ప్రకటన భోజనం చేస్తూ స్మార్ట్‌ఫోన్ వాడే అలవాటు ఉందా.. అయితే ఈ తీవ్రమైన అనారోగ్య సమస్యలు తప్పవు 'పరిషత్' పీఠాలపై పరోక్ష పోరు! అభాగ్యులకు అండగా సేవా సంస్థలు! పుస్తకాలు చదవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే ప్రశాంత ఎన్నికలకు సహకరించండి... డిఎస్పి రాఘవులు వైకాపా నుండి తెదేపాలో చేరిన 50 కుటుంబాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా.. రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ నియంత్రణతో ముప్పుకు చెక్ పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నిషేదిద్దాం గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయండి : 19న మండలపరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక

భర్త మరణంతో కష్టాల్లో ఉన్న కుటుంబానికి రూ.2 లక్షల బీమా సాయం

Select Suryaa Now
భర్త మరణంతో కష్టాల్లో ఉన్న కుటుంబానికి రూ.2 లక్షల బీమా సాయం

 

బ్యాంకు ఖాతాలో జమ చేసిన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు

మాకవరపాలెం, నవంబర్ 12, మేజర్ న్యూస్:

భర్తను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ మహిళకు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) పథకం ద్వారా రూ.2 లక్షల బీమా సాయం అందింది. మాకవరపాలెం మండలం దుంగవానిపాలెం గ్రామానికి చెందిన దుంగల రమణమ్మ భర్త అప్పలనాయుడు ప్రమాదవశాత్తు మరణించారు. ఈ క్రమంలో గ్రామంలో ఎస్.ఎస్.టి. ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్లు వరలక్ష్మి, నారాయణమూర్తి, దుర్గాదేవి నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు మేనేజర్ ప్రశాంత్‌కు తన భర్త మరణించిన విషయాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు బ్యాంకింగ్, సామాజిక భద్రతా పథకాలు, డిజిటల్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ మోసాలు, ప్రైవేటు ఆర్థిక సంస్థల మోసాలపై అవగాహన కల్పించారు. అటల్ పెన్షన్ యోజన, సుకన్య సమృద్ధి యోజన, రిజర్వ్ బ్యాంక్ అంబుడ్స్‌మన్, క్లెయిమ్ చేయని డిపాజిట్ల గురించి వివరించారు. పీఎంఎస్‌బీవై, పీఎంజేజేబీవై బీమా పథకాల ప్రయోజనాలను తెలియజేశారు. పీఎంఎస్‌బీవైకి ఏడాదికి రూ.20, పీఎంజేజేబీవైకి ఏడాదికి రూ.436 ప్రీమియం చెల్లిస్తే, అర్హత నిబంధనల మేరకు బీమా ప్రయోజనాలు పొందవచ్చని వివరించారు. రమణమ్మ తన భర్త బ్యాంకు పాస్‌బుక్‌ను చూపించడంతో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు రాచపల్లి శాఖలో ఖాతా వివరాలను పరిశీలించారు. ఆమె భర్త ఖాతాకు పీఎంజేజేబీవై బీమా ఉందని మేనేజర్ ప్రశాంత్ గుర్తించి, బీమా క్లెయిమ్‌కు దరఖాస్తు చేయించారు. దీంతో నామినీ అయిన రమణమ్మ ఖాతాలో రూ.2 లక్షల బీమా సొమ్ము జమ అయింది. ఈ మొత్తాన్ని వ్యవసాయం, పిల్లల చదువులు, కుటుంబ అభివృద్ధికి వినియోగించుకుంటానని ఆమె తెలిపారు. తమకు బీమా పథకం ఉందనే విషయం తెలియదని, ఆర్థిక అక్షరాస్యత సమావేశం ద్వారా విషయం తెలుసుకుని ప్రయోజనం పొందగలిగానని రమణమ్మ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సహాయం అందించిన బ్యాంకు మేనేజర్ ప్రశాంత్‌తో పాటు ఎస్.ఎస్.టి. ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ప్రాజెక్టు డైరెక్టర్ వి. ఆంజనేయులు, ప్రాజెక్టు మేనేజర్ వి. అశోక్ కుమార్, కౌన్సిలర్లు వరలక్ష్మి, నారాయణమూర్తి, దుర్గాదేవికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.