BREAKING
ఉత్తరాంధ్ర టైగర్ శత్రుచర్ల విజయరామరాజు మరణం తీరని లోటు కరుటూరి శ్రీహరి బాబుకు జగన్ అభినందనలు ప్రపంచ న్యూమోనియా దినోత్సవం శీతాకాలంలో సీతాఫలం తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. ఆ సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు! భారత జనగణన–2027 ఫేజ్-II ఫీల్డ్ ట్రైనర్ల శిక్షణ ప్రారంభం రౌడీషీటర్ అరెస్ట్, 14 రోజుల రిమాండ్. గూడ్స్ వాహనాల యజమానులు సమ్మె సైకిల్ పై 12 జ్యోతిర్లింగాల యాత్ర! ధర్మవరంలో తుఫాను బాధితులకు అండగా ప్రభుత్వం! సరదా ఈత విగతజీవులుగా మారిన విద్యార్థులు! కోమీర సర్పంచ్ పోటీకి బిజెపికి కేటాయించాలి సెలవుల్లో ఉన్న సర్వీస్ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం పంచాయతీకి తెలియజేయాలి భర్త మరణంతో కష్టాల్లో ఉన్న కుటుంబానికి రూ.2 లక్షల బీమా సాయం మేయర్ శ్రావణికి బుద్ధ నాగ జగదీష్ అభినందనలు. బంగారం చోరీ కేసులో నిందితుడి అరెస్టు.

అసత్య ఆరోపణలు వ్యక్తిగత విమర్శలు కాదు.. అభివృద్ధిపై చర్చకు రండి ఎమ్మెల్యే సంజీవరెడ్డి కి మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సవాల్

Select Suryaa Now
అసత్య ఆరోపణలు వ్యక్తిగత విమర్శలు కాదు.. అభివృద్ధిపై చర్చకు రండి ఎమ్మెల్యే సంజీవరెడ్డి కి మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సవాల్

నారాయణఖేడ్ ; నారాయణఖేడ్ భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయంలో నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి గురువారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అభివృద్ధి గురించి మాట్లాడకుండా అసత్య ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యత ఇవ్వడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రజలు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి కానీ, ప్రతిపక్ష నాయకులపై వ్యక్తిగత ఆరోపణలు చేయడానికి కాదని హితవు పలికారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధుల వ్యవహారంపై సమాధానం చెప్పాలి ఎన్ఆర్ఈజీఎస్ నుంచి రూ.25 లక్షలు డ్రా చేసిన వ్యవహారంపై తాము ప్రశ్నిస్తున్నామని, ఆ నిధులు ఎవరి ఖాతాల్లోకి వెళ్లాయి ఏ పనుల కోసం ఖర్చు చేశారు పనులు చేయకుండానే నిధులు డ్రా చేశారనే ఆరోపణల్లో వాస్తవమెంత అనే విషయాలను సంబంధిత ఆధారాలతో ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిధుల వినియోగంపై పారదర్శకత ఉండాలని, అక్రమాలు జరిగితే బాధ్యులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మేము చేసిన అభివృద్ధి ఇదీ.. మీరు చేసిన అభివృద్ధి ఏదీ మా ప్రభుత్వ హయాంలో నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ప్రతి తండాకు బీటీ రోడ్లు నిర్మించామని, ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, మురికి కాలువలు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేశామని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా పనిచేశామని గుర్తు చేశారు. రూ.100 కోట్లతో నిర్మిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా పనులు ముందుకు సాగడం లేదని విమర్శించారు. ఇప్పటి పరిస్థితి చూస్తుంటే ఆ పాఠశాల ప్రారంభం కావడానికి ఇంకా నాలుగైదు సంవత్సరాలు పట్టేలా ఉందని ఎద్దేవా చేశారు. ఆరోగ్య రంగాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రజల పరిస్థితి ఏమిటి మా ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రులను నిర్మించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో నమ్మకం తగ్గే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి పేదలకు నాణ్యమైన వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. మంచినీటి సమస్యపై ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి మా ప్రభుత్వ హయాంలో ప్రతి ఇంటికి ప్రతిరోజూ స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకున్నామని, ప్రస్తుతం అనేక గ్రామాల్లో రోజుల తరబడి తాగునీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ప్రజలకు తాగునీరు అందించలేని పరిస్థితి ఎందుకు వచ్చిందో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి ఎన్నికల ముందు చెప్పిన మాటలు ఏమయ్యాయి అధికారంలోకి వచ్చాక చేసిన అభివృద్ధి ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలతో ప్రజల దృష్టిని మళ్లించాలని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. వ్యక్తిగత విమర్శలు కాదు.. అభివృద్ధిపై చర్చకు రండినారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని భూపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మేము చేసిన అభివృద్ధిని ప్రజల ముందు ఉంచడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధిని కూడా ప్రజలకు వివరించండి. ఆధారాలతో మాట్లాడండి.. వాస్తవాలతో సమాధానం చెప్పండి.. ప్రజలకు నిజానిజాలు తెలియజేయండి అని సవాల్ విసిరారు. అధికారం శాశ్వతం కాదు.. ప్రజల నమ్మకమే అసలైన బలం. ప్రతిపక్షాలపై బురదజల్లడం మానేసి, ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి కి సూచించారు. నారాయణఖేడ్ ప్రజలకు కావాల్సింది వ్యక్తిగత విమర్శలు కాదు అభివృద్ధి హామీలతో కాలం వెళ్లదీయడం కాదు చేతల్లో పని చేసి చూపించడం అని వారన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.