BREAKING
గ్రంథాలయ వారోత్సవాల గోడ పత్రిక ఆవిష్కరణ కృత్రిమ మేధ పరిణామాలపై ఐఎంఎఫ్ నిరంతర నిఘా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి "ఎస్. వి. సి.టి" చేయూత జర్మనీలో పెట్టుబడులకు మెర్సిడెస్ బెంజ్ బ్రేక్ ఐపీఎల్ 2027 వేలానికి ముందు సీఎస్‌కే ఆటగాడిపై ఎస్‌ బద్రినాథ్ సంచలన వ్యాఖ్యలు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై స్టేజ్‌–1 ఆర్‌ఓలకు శిక్షణ.. జోన్స్ చట్టం మినహాయింపును పొడిగించే యోచనలో వైట్ హౌస్ ఆ...అధికారుల పేర్లు డిజిటల్ బుక్‌లో నమోదు శిమ్మ రాజశేఖర్ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలి మాజీ సైనికుల మానసిక ఆరోగ్యంపై అమెరికా ప్రత్యేక దృష్టి ప్రపంచ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉంది 2.2 బిలియన్ డాలర్ల రుణ ప్యాకేజీ ఆమోదం పొందాలంటే బడ్జెట్ చట్టాన్ని అమలు చేయాల్సిందే వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి పరామర్శించిన యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు కేవలం రెండే రెండు తెలుగు సినిమాలలో నటించిన ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తున్నారా? శత్రుచర్ల విజయరామరాజు మృతి పట్ల మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తీవ్ర దిగ్భ్రాంతి

ఖైదీల సమస్యలు తెలుసుకున్న జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి

Select Suryaa Now
ఖైదీల సమస్యలు తెలుసుకున్న జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి

సిద్దిపేట, ; సిద్దిపేట జిల్లా జైలును జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సెక్రటరీ శ్రీమతి కె. సౌజన్య శుక్రవారం సందర్శించారు. తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ, హైదరాబాద్ ఆదేశాలు, సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్ జి. సుదర్శన్ సూచనల మేరకు ఆమె ఈ పర్యటన చేపట్టారు.ఈ సందర్భంగా జైలులోని ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలు, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు అందిస్తున్న భోజన సౌకర్యాలు, వంటగది, నిల్వ గది, మరుగుదొడ్లను పరిశీలించారు. జైలులో ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాలపై జైలు సూపరింటెండెంట్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కె. సౌజన్య మాట్లాడుతూ ఖైదీలందరూ సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. జైలులో ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయవాది ఉండాలని, న్యాయవాదులు లేని వారికి ఉచిత న్యాయసహాయం అందించేందుకు న్యాయసేవాధికార సంస్థ సిద్ధంగా ఉంటుందని తెలిపారు.న్యాయసహాయ రక్షణ న్యాయవాదులు ప్రతి వారం జిల్లా జైలును సందర్శిస్తారని, న్యాయవాదులు లేని ఖైదీలకు ఉచితంగా న్యాయసహాయం అందిస్తారని వివరించారు. ఖైదీలు తమకు ఉన్న న్యాయపరమైన సమస్యలను న్యాయసేవాధికార సంస్థ దృష్టికి తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా జైలు సూపరింటెండెంట్ జి. రత్నం, డిప్యూటీ జైలర్ వి. వికాస్, సహాయ న్యాయసహాయ రక్షణ న్యాయవాది ఎం. రవికుమార్, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.