జీబీఆర్లో క్రీడా సందడి.. విద్యార్థుల్లో ఉత్సాహం.
అనపర్తి, మేజర్ న్యూస్. విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో జీబీఆర్ విద్యాసంస్థల్లో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఇంట్రా స్పోర్ట్స్ పోటీలు గురువారం అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. జీబీఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ క్రీడా మైదానంలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. జీబీఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డీన్ జి. హరిప్రసాద్, హైస్కూల్ హెచ్ఎం రామారావు, ప్రైమరీ హెచ్ఎం భువనేశ్వరి, ప్రీ ప్రైమరీ హెచ్ఎం కామాక్షి, ఏసీ క్యాంపస్ ప్రిన్సిపాల్ టి. బుచ్చిరాజు, ఇన్ఛార్జులు వెంకటరెడ్డి, అకడమిక్ కో-ఆర్డినేటర్ ప్రశాంతిరెడ్డి, ఏవో ఆచారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జీబీఆర్ పీజీ డైరెక్టర్ బి. రత్నారెడ్డి క్రీడాజ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జీబీఆర్ డిగ్రీ కళాశాల డైరెక్టర్ హరినాధరెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నల్లమిల్లి పెద్ద అబ్బాయిరెడ్డి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పి.ఆర్.ఎల్. స్వామి, గేమ్స్ డైరెక్టర్ మహేంద్రరెడ్డి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ కుమారి తదితరులు అతిథులుగా హాజరయ్యారు. తొలుత 4×100 మీటర్ల రిలే పరుగు పోటీలను అతిథులు ప్రారంభించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ మూడు రోజుల క్రీడా సంబరాల్లో కబడ్డీ, ఖోఖో, పరుగు పందాలు, లాంగ్ జంప్, హైజంప్, టగ్ ఆఫ్ వార్, త్రోబాల్ తదితర క్రీడా పోటీలను నిర్వహించనున్నారు. మొత్తం 150కి పైగా విభాగాల్లో 1300కు పైగా బహుమతులను విజేతలకు అందజేయనున్నారు. కాకినాడ స్పోర్ట్స్ క్లబ్లో వివిధ క్రీడా విభాగాల్లో ప్రత్యేక శిక్షణ పొందిన పీఈటీలు, కోచ్ల పర్యవేక్షణలో పోటీలను నిష్పాక్షికంగా నిర్వహించి ప్రతిభావంతులైన విజేతలను ఎంపిక చేయనున్నారు.ఈ సందర్భంగా జీబీఆర్ విద్యాసంస్థల సెక్రటరీ, కరస్పాండెంట్ తేతలి ఆదిరెడ్డి (కొండబాబు) మాట్లాడుతూ విద్యార్థుల్లో చిన్నతనం నుంచే క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడంతో పాటు వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడం, శారీరక దృఢత్వం, మానసిక వికాసాన్ని పెంపొందించడమే ఈ క్రీడా పోటీల ప్రధాన ఉద్దేశమని తెలిపారు.