రాజీయే రాజ మార్గం... లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి
జూనియర్ సివిల్ జడ్జి ఎం. రోషిణి
కోటబొమ్మాళి, నవంబర్ 12, మేజర్ న్యూస్:
స్థానిక జూనియర్ సివిల్ కోర్టులో డిసెంబరు 12వ తేదీ ఉదయం 10 గంటల నుండి నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు, న్యాయవాదులు, పోలీసులు సద్వినియోగం చేసుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి ఎం. రోషిణి పిలుపునిచ్చారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రాజీయే రాజమార్గమని పేర్కొన్నారు. ఈ వేదిక ద్వారా రాజీకి అనుకూలమైన అన్ని క్రిమినల్, సివిల్, బ్యాంకు మరియు ప్రీ-లిటిగేషన్ కేసులను ఇరుపార్టీల అంగీకారంతో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. వీలైనన్ని ఎక్కువ కేసులను ఇక్కడ పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు. అలాగే లోక్ అదాలత్‌లో సివిల్ కేసులు పరిష్కారమైతే చెల్లించిన కోర్టు ఫీజు కూడా వాపసు ఇవ్వబడుతుందని ఆమె స్పష్టం చేశారు.