BREAKING
ఎన్విడియా తదుపరి సీఈఓగా రెనే హాస్? జెన్సెన్ హువాంగ్ వారసుడిపై టెక్ దిగ్గజం కసరత్తు టీయూడబ్ల్యూజె – ఐజెయు కమిటీలో లక్షెట్టిపేట ప్రెస్ క్లబ్‌కు కీలక పదవులు ! సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ క్యూ2 ఫలితాలు: రూ. 660 కోట్లకు పెరిగిన ఆదాయం, రూ. 81 కోట్ల నికర లాభం నమోదు రూ. 8,415 కోట్ల AT-1 బాండ్ల రద్దు తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన యెస్ బ్యాంక్ సిగరెట్ ధరలను మళ్లీ పెంచిన ఐటీసీ: గోల్డ్ ఫ్లేక్, క్లాసిక్ కనెక్ట్ కొత్త రేట్లు ఇవే నేటి పంచాంగం 14 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు (14 నవంబర్ 2026, శనివారం): 12 రాశుల దినఫలాలు ఇవే మాస్కోలో భారీ కారు బాంబు పేలుడు: రష్యా అనుకూల నేత సెర్గీ జవోరోట్నీకి తీవ్ర గాయాలు అదానీ విద్యుత్ ప్రాజెక్టు వ్యయం తగ్గింపుపై కేంద్ర పర్యావరణ శాఖ విచారణ చకుముఖి టాలెంట్ టెస్టులో శ్రీవాణి విద్యార్థుల ప్రతిభ మండల స్థాయి పోటీలకు ముగ్గురు విద్యార్థుల ఎంపిక పాకిస్థాన్‌కు సైనిక రహస్యాల చేరవేత: వాయుసేన వింగ్ కమాండర్‌పై చార్జిషీట్ దాఖలు చేసిన ఢిల్లీ పోలీసులు రైతుల విద్యుత్ కష్టాలకు తెర.. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వార్డుల్లో నీటిని, విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలి ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ నావికుడు...అత్యవసర సర్టిఫికేట్ జారీ, త్వరలో స్వదేశానికి రాక భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును కాపాడుకుందాం

మళ్లీ మారిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్..

Select Suryaa Now
మళ్లీ మారిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్..


- మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణకు కసరత్తు!
-  జిల్లాలో 30 మండలాలు.. 904 గ్రామ పంచాయతీలు.. 8,702 పోలింగ్ కేంద్రాలు.

శ్రీకాకుళం నవంబర్ 12 మేజర్ న్యూస్ : జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌లో మరోసారి మార్పులు చోటుచేసుకున్నాయి. తాజా షెడ్యూల్ ప్రకారం జిల్లాలోని 30 మండలాలను మూడు విడతలుగా విభజించి ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు మండలాల వారీగా గ్రామ పంచాయతీలు (GPs), పోలింగ్ స్టేషన్ల (PS) వివరాలతో కూడిన నూతన జాబితాను సిద్ధం చేశారు.

తొలి విడత (ఫేజ్–1): ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, సోంపేట, పలాస, మందస, వజ్రపుకొత్తూరు మొత్తం 7 మండలాల్లో 194 గ్రామ పంచాయతీలు, 1,956 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.

రెండో విడత (ఫేజ్–2): ఎచ్చెర్ల, జి.సిగడాం, లావేరు, రణస్థలం, ఆమదాలవలస, బూర్జ, పొందూరు, సరుబుజ్జిలి, కొత్తూరు, హిరమండలం, ఎల్.ఎన్.పేట, మెళియాపుట్టి, పాతపట్నం మొత్తం 13 మండలాల్లో 386 గ్రామ పంచాయతీలు, 3,634 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.

మూడో విడత (ఫేజ్–3): నరసన్నపేట, పోలాకి, సారవకోట, జలుమూరు, శ్రీకాకుళం, గార, టెక్కలి, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, నందిగాం మొత్తం 10 మండలాల్లో 324 గ్రామ పంచాయతీలు, 3,112 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.

నరసన్నపేట నియోజకవర్గానికి మూడో విడతలో ఎన్నికలు!

తాజా షెడ్యూల్ ప్రకారం నరసన్నపేట నియోజకవర్గ పరిధిలోని నరసన్నపేట, పోలాకి, సారవకోట, జలుమూరు మండలాలు మూడో విడతలోకి వచ్చాయి. దీంతో ఆయా మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాజకీయ పార్టీలు, ఆశావహులు తమ కార్యాచరణను అందుకు అనుగుణంగా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మొత్తంగా జిల్లాలోని 30 మండలాల పరిధిలో 904 గ్రామ పంచాయతీలకు సంబంధించి 8,702 పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదిస్తూ తాజా షెడ్యూల్ రూపొందించారు. వరుసగా మారుతున్న ఎన్నికల షెడ్యూల్‌తో గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ సందడి మరింత పెరగనుంది. ఎన్నికల తేదీలు, ఇతర మార్గదర్శకాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.