వృత్తి విద్యా ఉపాధ్యాయులకు మూడు రోజుల కౌశల్ బోధ్ శిక్షణ
సంగారెడ్డి:; జిల్లా సైన్స్ కేంద్రంలో వృత్తి విద్యా ఉపాధ్యాయులకు మూడు రోజుల పాటు నిర్వహించిన కౌశల్ బోధ్ వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) ఆదేశాల మేరకు, ఏఎంఓ బాలయ్య సూచనలతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని 55 వృత్తి విద్యా పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.ఈ శిక్షణలో భాగంగా వృత్తి విద్యా బోధనలో నూతన పద్ధతులు, విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యాల అభివృద్ధి, బోధనలో ఆచరణాత్మక అంశాలపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా సామాజిక శాస్త్ర ఉపాధ్యాయులకు శిక్షణ అందించారు.జిల్లా నోడల్ అధికారి లింభాజీ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం కొనసాగింది. శిక్షణ వనరుల వ్యక్తులుగా వెంకటేశం, చంద్రశేఖర్, అప్పిరెడ్డి, శ్రీశైలం, అనిల్ కుమార్, అశ్విని తదితరులు పాల్గొని ఉపాధ్యాయులకు వివిధ అంశాలపై శిక్షణ అందించారు.వృత్తి విద్యను మరింత నాణ్యవంతంగా బోధించేందుకు, విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు.