BREAKING
మీర్జాపూర్ విజయపు ఒత్తిడిని అసలు తీసుకోను.. నటి శ్వేతా త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు క్యాన్సర్ ముప్పును దూరం చేసే అద్భుతమైన ఆరోగ్య అలవాట్లు.. నిపుణులు ఏం చెబుతున్నారు? న్యూజిలాండ్ గడ్డపై భారత ఫుట్‌బాల్ జట్టుకు ఘోర పరాభవం.. తొలి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో కివీస్ జయభేరి దర్శకుడిగా మారిన రవి మోహన్.. యోగి బాబు హీరోగా 'ఆన్ ఆర్డినరీ మన్' నుంచి కొత్త సాంగ్ రిలీజ్ దిగ్గజ నటుడు పద్మశ్రీ మధుకు అరుదైన గౌరవం.. ప్రథమ బిచ్చు తిరుమల పురస్కారం ప్రకటన భోజనం చేస్తూ స్మార్ట్‌ఫోన్ వాడే అలవాటు ఉందా.. అయితే ఈ తీవ్రమైన అనారోగ్య సమస్యలు తప్పవు 'పరిషత్' పీఠాలపై పరోక్ష పోరు! అభాగ్యులకు అండగా సేవా సంస్థలు! పుస్తకాలు చదవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే ప్రశాంత ఎన్నికలకు సహకరించండి... డిఎస్పి రాఘవులు వైకాపా నుండి తెదేపాలో చేరిన 50 కుటుంబాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా.. రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ నియంత్రణతో ముప్పుకు చెక్ పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నిషేదిద్దాం గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయండి : 19న మండలపరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక

ఓపెన్‌ స్కూల్‌లో పదో తరగతి ప్రవేశాలు

Select Suryaa Now
ఓపెన్‌ స్కూల్‌లో పదో తరగతి ప్రవేశాలు

 

నక్కపల్లి,మేజర్ న్యూస్; నవంబరు 12: వివిధ కారణాలతో మధ్యలో చదువు మానేసిన వారికి ఓపెన్‌ స్కూల్‌ ద్వారా పదో తరగతి చదివే అవకాశం కల్పిస్తున్నట్లు ఎంఈవో-1 కే.నరేష్‌, ఎంఈవో-2 ఆర్‌.నాగన్నదొర తెలిపారు. గురువారం వెలుగు కార్యాలయంలో తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. 2026-27 విద్యా సంవత్సరానికి వేంపాడు ఉన్నత పాఠశాలలో ప్రవేశాలు ప్రారంభమైనట్లు పేర్కొన్నారు. 14 ఏళ్లు నిండిన వారు, పదో తరగతి తప్పిన వారు అర్హులన్నారు. సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తామని, మహిళలు, ఎస్సీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులకు ఫీజు రాయితీ ఉంటుందని తెలిపారు. ఉద్యోగాలు, ఉన్నత విద్యకు ఓపెన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌ రెగ్యులర్‌ పదో తరగతితో సమానమైన గుర్తింపు కలిగి ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్నవారు 9963218079 నంబరులో వేంపాడు పాఠశాల హెచ్‌ఎం యు.వరలక్ష్మిని సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో వెలుగు ఏపీఎం పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.