సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కాట సుధా శ్రీనివాస్ గౌడ్
సంగారెడ్డి ; సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కాట సుధా శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబా, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా కాట సుధా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ అధిష్ఠానం తనపై నమ్మకం ఉంచి జిల్లా స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సంగారెడ్డి జిల్లాలో మహిళా కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. మహిళలను సంఘటితం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆశయాలు, విధానాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని స్పష్టం చేశారు.జాతీయ, రాష్ట్ర నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ అభివృద్ధికి, మహిళా సాధికారతకు అంకితభావంతో పనిచేస్తానని కాట సుధా శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.