BREAKING
మృత్యువుకే ఎదురెళ్ళి గెలిచిన వీరనారీమణులు.. క్యాన్సర్‌ను జయించి స్ఫూర్తిగా నిలిచిన హీరోయిన్స్ సొంత పార్టీ ఎంపీ కార్యక్రమానికి వెళ్తే సస్పెండ్ చేస్తారా? ఏకపక్ష సస్పెన్షన్‌ను వెంటనే రద్దు చేయాలి జీబీఆర్‌లో క్రీడా సందడి.. విద్యార్థుల్లో ఉత్సాహం. సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కాట సుధా శ్రీనివాస్ గౌడ్ మెగాస్టార్ చిరంజీవి ‘కాకా’ నైజాం రైట్స్ సంచలనం.. రూ.35 కోట్ల భారీ డీల్‌ను దక్కించుకున్న ఏషియన్ సినిమాస్! కరువు రైతులకు రుణ ఉపశమనం కల్పించాలి! బ్యాంకర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలి..జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీకిరణ్ సూచనలు ప్రతి ఒక్కరూ కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి శాంతిభద్రతలకే కార్డెన్ సెర్చ్. శాంతిభద్రతలకే కార్డెన్ సెర్చ్. నర్సరీ రైతు మార్గాని సత్యనారాయణకు యూనియన్ బ్యాంక్ పురస్కారం వారణాసి సినిమా ఓటీటీ రైట్స్ సంచలనం.. రూ.500 కోట్ల రికార్డు బిజినెస్‌పై టాలీవుడ్‌లో జోరుగా చర్చ! ఖైదీల సమస్యలు తెలుసుకున్న జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి గాంధీ పురం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఎవరు..? ఆశావాహుల పేర్లు శాంతాడంత.... ఎమ్మెల్యే ఎవరికి ఓకే అంటే వారే అభ్యర్థి... పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలి పత్తి సాగుపై రైతులకు అవగాహన

48వ డివిజన్‌లో విద్యుత్ అంతరాయం యుద్ధప్రాతిపదికన మరమ్మతులు

Select Suryaa Now
48వ డివిజన్‌లో విద్యుత్ అంతరాయం యుద్ధప్రాతిపదికన మరమ్మతులు

​అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్ : అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆదేశాల మేరకు, స్థానిక 48వ డివిజన్‌లో తలెత్తిన విద్యుత్ సమస్యను అధికారులు మరియు ప్రజాప్రతినిధులు తక్షణమే పరిష్కరించారు. గురువారం డివిజన్ పరిధిలోని విద్యుత్ తీగలపై భారీ చెట్ల కొమ్మలు విరిగి పడటంతో కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

​విషయం తెలుసుకున్న 48వ డివిజన్ కార్పొరేటర్ చేపల సంగీత, 5వ క్లస్టర్ ఇంచార్జ్ చేపల హరి తక్షణమే స్పందించారు. వెంటనే విద్యుత్ శాఖ (ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్) సిబ్బందిని ఘటనా స్థలానికి పిలిపించారు. దగ్గరుండి పర్యవేక్షిస్తూ విరిగిపడిన కొమ్మలను తొలగింపజేసి, తెగిన వైర్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరింపజేశారు.

​సమస్య తలెత్తిన వెంటనే స్పందించి కరెంటు సరఫరాను పునరుద్ధరించడం పట్ల డివిజన్ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మరమ్మతు పనుల పర్యవేక్షణలో డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : మొయినుద్దిన అనంతపురం బ్యూరో  మేజర్ న్యూస్