BREAKING
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి "ఎస్. వి. సి.టి" చేయూత జర్మనీలో పెట్టుబడులకు మెర్సిడెస్ బెంజ్ బ్రేక్ ఐపీఎల్ 2027 వేలానికి ముందు సీఎస్‌కే ఆటగాడిపై ఎస్‌ బద్రినాథ్ సంచలన వ్యాఖ్యలు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై స్టేజ్‌–1 ఆర్‌ఓలకు శిక్షణ.. జోన్స్ చట్టం మినహాయింపును పొడిగించే యోచనలో వైట్ హౌస్ ఆ...అధికారుల పేర్లు డిజిటల్ బుక్‌లో నమోదు శిమ్మ రాజశేఖర్ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలి మాజీ సైనికుల మానసిక ఆరోగ్యంపై అమెరికా ప్రత్యేక దృష్టి ప్రపంచ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉంది 2.2 బిలియన్ డాలర్ల రుణ ప్యాకేజీ ఆమోదం పొందాలంటే బడ్జెట్ చట్టాన్ని అమలు చేయాల్సిందే వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి పరామర్శించిన యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు కేవలం రెండే రెండు తెలుగు సినిమాలలో నటించిన ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తున్నారా? శత్రుచర్ల విజయరామరాజు మృతి పట్ల మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తీవ్ర దిగ్భ్రాంతి ఘనా ఆర్థిక స్థిరత్వం, వృద్ధిపై ఐఎంఎఫ్ ప్రశంసలు ప్రజా సమస్యలు’ పుస్తక ఆవిష్కరణ...

పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలి

Select Suryaa Now
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలి

                               అధికారులకు ప్రత్యేక అధికారి నక్కా మూర్తి దిశానిర్దేశం

కడియం, మేజర్ న్యూస్,:కడియం మండలంలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని మండల ప్రత్యేక అధికారి నక్కా ఎన్.వి.వి.ఎస్. మూర్తి సూచించారు.
గురువారం కడియం మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల ప్రత్యేక అధికారి, పీడీ (టూరిజం) నక్కా ఎన్.వి.వి.ఎస్. మూర్తి హాజరై జోనల్ అధికారులు, రూట్ అధికారులకు ఎన్నికల ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆదేశించారు. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, సజావుగా జరిగేలా అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో వ్యవహరించాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఎంపీడీవో కె. రమేష్, తహసీల్దార్ ఎం. శ్రీనివాస్, సీఐ ఎ. వెంకటేశ్వరరావు, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, జోనల్, రూట్ అధికారులు పాల్గొన్నారు.