BREAKING
గ్రంథాలయ వారోత్సవాల గోడ పత్రిక ఆవిష్కరణ కృత్రిమ మేధ పరిణామాలపై ఐఎంఎఫ్ నిరంతర నిఘా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి "ఎస్. వి. సి.టి" చేయూత జర్మనీలో పెట్టుబడులకు మెర్సిడెస్ బెంజ్ బ్రేక్ ఐపీఎల్ 2027 వేలానికి ముందు సీఎస్‌కే ఆటగాడిపై ఎస్‌ బద్రినాథ్ సంచలన వ్యాఖ్యలు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై స్టేజ్‌–1 ఆర్‌ఓలకు శిక్షణ.. జోన్స్ చట్టం మినహాయింపును పొడిగించే యోచనలో వైట్ హౌస్ ఆ...అధికారుల పేర్లు డిజిటల్ బుక్‌లో నమోదు శిమ్మ రాజశేఖర్ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలి మాజీ సైనికుల మానసిక ఆరోగ్యంపై అమెరికా ప్రత్యేక దృష్టి ప్రపంచ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉంది 2.2 బిలియన్ డాలర్ల రుణ ప్యాకేజీ ఆమోదం పొందాలంటే బడ్జెట్ చట్టాన్ని అమలు చేయాల్సిందే వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి పరామర్శించిన యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు కేవలం రెండే రెండు తెలుగు సినిమాలలో నటించిన ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తున్నారా? శత్రుచర్ల విజయరామరాజు మృతి పట్ల మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తీవ్ర దిగ్భ్రాంతి

గాంధీ పురం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఎవరు..? ఆశావాహుల పేర్లు శాంతాడంత.... ఎమ్మెల్యే ఎవరికి ఓకే అంటే వారే అభ్యర్థి...

Select Suryaa Now
గాంధీ పురం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఎవరు..?  ఆశావాహుల పేర్లు శాంతాడంత....  ఎమ్మెల్యే ఎవరికి ఓకే అంటే వారే అభ్యర్థి...

తిరుపతి రూరల్,
మేజర్ న్యూస్ :
గ్రామ పంచాయతీల ఎన్నికల షెడ్యూల్ మరి కొత్త గంటల్లో ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి రూరల్ మండలంలోని పలు గ్రామ పంచాయతీల సర్పంచ్ అభ్యర్థులు ఎవరు అనేది ఇంతవరకు తేలడం లేదు. కూటమి పార్టీ నేతలతో పాటు వైసిపి నేతలలో కూడా ఆయా గ్రామ పంచాయతీలలో సర్పంచ్ అభ్యర్థులు ఎవరు అనేది ఇంతవరకు తేలలేదు. మరో పక్క సమయం రోజుకు దగ్గర పడుతోంది. సర్పంచ్ గా పోటీ చేయాలనే ఆశవహలు కూడా రోజురోజుకు పంచాయతీలలో శాంతాడంత మంది పేర్లు వెలుగులోకి వస్తున్నాయి.
ఇప్పటికైనా ఎమ్మెల్యే పులివర్తి నాని జోక్యం చేసుకొని గ్రామపంచాయతీలకు తమ పార్టీ మద్దతుదారులైన సర్పంచ్ అభ్యర్థులు ఎవరో ప్రకటిస్తే వారు ఎన్నికల బిజీలో నిమగ్నం అయ్యే పరిస్థితి నెలకొంటుంది. మరో పక్క వైసీపీలోనూ తిరుపతి రూరల్ మండలంలో సర్పంచ్ అభ్యర్థులను ప్రకటించకపోవడంతో అక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి నెలకొంది.

గాంధీపురం సర్పంచ్ అభ్యర్థి ఎవరు ...?
గాంధీ పురం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి బీసీ జనరల్ కు కేటాయించారు. గ్రామపంచాయతీలో 6900 కు పైగా ఓటర్లు ఉన్నారు. వీటిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఈ పంచాయతీలో స్థిరపడిన ఓటర్ల సంఖ్య కూడా అధికమనే చెప్పవచ్చు. ఆ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారు అనేది ప్రశ్నార్థకమే. తెలుగుదేశం పార్టీ మద్దతుతో నలుగురైదు మంది సర్పంచ్ గా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వారిలో కొంతమందికి ఆర్థిక బలం ఉంది. మరి కొంతమంది తెలుగుదేశం పార్టీలో సీనియర్ కార్యకర్తలుగా చెప్పుకుంటున్నారు.
మొదటినుంచి తెలుగుదేశం పార్టీలో ఏలిక ధనుంజయ యాదవ్ హేమలత, వసంత, కలకడ కృష్ణయ్య, చందు ఉంటున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇకపోతే స్థానికంగా రవి స్థానిక నేతలతో మంచి పరిచయాలు ఉండడంతో పాటు ఎవరికీ ఏ అవసరం వచ్చినా తాను ఉన్నానంటూ భరోసా కల్పించే వ్యక్తి గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కూడా సర్పంచ్ బరిలో పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే పంచాయతీలో సర్పంచ్ గా పోటీ చేయాలనుకునేవారు  ఎవరికివారుగా చెప్పుకుంటున్నారే తప్పా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి అభ్యర్థుత్వం ఖరారు చేసుకోవడంలో వెనకడుగు వేస్తున్నారు.

అందరూ కూర్చొని మాట్లాడుకుని ఒక పేరు చెప్పండి...
పంచాయతీలో సర్పంచ్ గా పోటీ చేయాలనుకునే వారంతా కూర్చుని సమావేశమై ఒకరి పేరు తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే పులివర్తి నాని ఇప్పటికే స్థానిక నేతలకు చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం కొంతమంది ఆశావహులు సమావేశమై ఒకరి పేరు తీర్మానించి ఎమ్మెల్యే కార్యాలయానికి పంపినట్లు సమాచారం. ఏది ఏమైనా వీలైనంత త్వరగా సర్పంచ్ అభ్యర్థి ఎవరు అనేది ప్రకటిస్తే సమయం తక్కువగా ఉండటంతో ప్రచారాలు ఇతర ఇతర కార్యక్రమాలలో బిజీ అయ్యే అవకాశం ఉంటుంది.
వైసిపి మద్దతు సర్పంచ్ అభ్యర్థి ఎవరు...
వైసిపి మద్దతు సర్పంచ్ అభ్యర్థి ఎవరనేది కూడా ఇంతవరకు తేలలేదు. గతంలో మన్నూరు శివ సతీమణి సర్పంచ్ గా ఉన్నారు. ఇప్పుడు వైసిపి పార్టీ మద్దతుతో మన్నూరు శివ సర్పంచ్ గా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరో పక్క అదే పార్టీకి చెందిన ఆటో బాబు కూడా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇతనికి  పంచాయతీలో ఉంటున్న వైసీపీ నేత, స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు జ్ఞాన శేఖర్ రెడ్డి మద్దతు ఉన్నట్టు సమాచారం.  ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నాయకత్వం గ్రామపంచాయతీలో ప్రజాబలం, ఆర్థిక బలం ఉన్న బలమైన నాయకుడిని సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటిస్తారని పంచాయతీ ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు.

సర్పంచ్ అభ్యర్థిగా రవి పేరు ఖరారు..!
తెలుగుదేశం పార్టీ మద్దతు కలిగిన గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి  వై.ఎస్ రవి  పేరును ఎమ్మెల్యే పులివర్తి నాని ఖరారు చేసినట్లు సమాచారం. శుక్రవారం సాయంత్రం లోగా రవి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు చెబుతున్నారు. వైయస్ రవి కి ఆర్థిక బలంతో పాటు స్థానిక నాయకులతో పాటు కార్యకర్తలలో మంచిపట్టు ఉందని నేతలు చెబుతున్నారు. పంచాయతీలోని ప్రజలతో సత్సంబంధాలు 
నెరపడములో వెనుకంజ లో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఏది ఏమైనా  తెలుగుదేశం పార్టీ అధిష్టానం సర్పంచ్ అభ్యర్థిగా వైయస్ రవి వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.

H. Dwaraka, staff reporter 

9705347341.