BREAKING
గ్రంథాలయ వారోత్సవాల గోడ పత్రిక ఆవిష్కరణ కృత్రిమ మేధ పరిణామాలపై ఐఎంఎఫ్ నిరంతర నిఘా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి "ఎస్. వి. సి.టి" చేయూత జర్మనీలో పెట్టుబడులకు మెర్సిడెస్ బెంజ్ బ్రేక్ ఐపీఎల్ 2027 వేలానికి ముందు సీఎస్‌కే ఆటగాడిపై ఎస్‌ బద్రినాథ్ సంచలన వ్యాఖ్యలు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై స్టేజ్‌–1 ఆర్‌ఓలకు శిక్షణ.. జోన్స్ చట్టం మినహాయింపును పొడిగించే యోచనలో వైట్ హౌస్ ఆ...అధికారుల పేర్లు డిజిటల్ బుక్‌లో నమోదు శిమ్మ రాజశేఖర్ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలి మాజీ సైనికుల మానసిక ఆరోగ్యంపై అమెరికా ప్రత్యేక దృష్టి ప్రపంచ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉంది 2.2 బిలియన్ డాలర్ల రుణ ప్యాకేజీ ఆమోదం పొందాలంటే బడ్జెట్ చట్టాన్ని అమలు చేయాల్సిందే వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి పరామర్శించిన యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు కేవలం రెండే రెండు తెలుగు సినిమాలలో నటించిన ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తున్నారా? శత్రుచర్ల విజయరామరాజు మృతి పట్ల మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తీవ్ర దిగ్భ్రాంతి

నర్సరీ రైతు మార్గాని సత్యనారాయణకు యూనియన్ బ్యాంక్ పురస్కారం

Select Suryaa Now
నర్సరీ రైతు మార్గాని సత్యనారాయణకు యూనియన్ బ్యాంక్ పురస్కారం

                  ఉత్తమ రైతుగా ఎంపిక చేసి ఘన సన్మానం.. నర్సరీ రంగంలో విశేష కృషికి గుర్తింపు

కడియం మేజర్ న్యూస్ :నర్సరీ రంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ మొక్కల పెంపకంలో ప్రత్యేక గుర్తింపు పొందిన కడియం మండలం కడియపులంకకు చెందిన వీర హనుమాన్ నర్సరీ రైతు మార్గాని సత్యనారాయణకు అరుదైన గౌరవం లభించింది. నర్సరీ రంగానికి ఆయన అందిస్తున్న సేవలను గుర్తించిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉత్తమ రైతుగా ఎంపిక చేసి ఘనంగా సత్కరించింది.యూనియన్ బ్యాంక్ 108వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం రాజమహేంద్రవరంలోని జేకే గార్డెన్స్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మార్గాని సత్యనారాయణను ఘనంగా సన్మానించి ప్రశంసాపత్రం అందజేశారు. మొక్కల పెంపకాన్ని వృత్తిగా ఎంచుకుని, నర్సరీ రంగం అభివృద్ధికి కృషి చేస్తూ వ్యవసాయ అనుబంధ రంగంలో తనదైన ముద్ర వేసిన ఆయన సేవలకు ఈ పురస్కారం గుర్తింపుగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ రీజినల్ మేనేజర్ ఏ. విశ్వేశ్వరరావు, కడియం యూనియన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ ఆర్. సుభాష్, రీజినల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కడియం ప్రాంతానికి చెందిన నర్సరీ రైతుకు ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ నుంచి ఈ గౌరవం లభించడంపై స్థానిక నర్సరీ రైతులు హర్షం వ్యక్తం చేశారు.