మంత్రి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ శ్రేణులు
ఎన్డీఏ పాలన, నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమ చేరికకు కారణమన్న నాయకులు
రామచంద్రపురం మేజర్ న్యూస్ :రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో ద్రాక్షారామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 మంది శ్రేణులు తెలుగుదేశం పార్టీలోచేరారు.ద్రాక్షారామ ఎంపీటీసీ డాక్టర్ మడక రాంబాబు స్వగృహంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి సుభాష్ వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
మాజీ వార్డు మెంబర్ యండమూరి ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పాలన నియోజకవర్గంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ఆయన వ్యక్తిగతంగా నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు తమను ఆకట్టుకున్నాయని పార్టీలో చేరిన వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ నూతనంగా పార్టీలో చేరిన వారందరికీ స్వాగతం పలికారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, గౌరవం ఉంటాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రామచంద్రపురం మున్సిపల్ చైర్మన్ మేడిశెట్టి శేషారావు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, ఎంపీటీసీ డాక్టర్ మడక రాంబాబు, మాగాపు అమ్మిరాజు, టేకుమూడి సత్యనారాయణ, సంపత్ సత్యనారాయణ, ముప్పనపల్లి గణేష్ తదితరులు పాల్గొన్నారు.