సీతానగరం మండలంలో ప్రపంచ న్యూమోనియా దినోత్సవం
సీతానగరం సూర్య న్యూస్: తూర్పుగోదావరి జిల్లా సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డా.వి.భవాని, డా. ఇ .యేసు రాణి , ఎం.శైలజ రాణి ఆధ్వర్యంలో సీతానగరం మండలంలోని అన్ని గ్రామాల్లో వైద్య ఆరోగ్య సిబ్బందితో ప్రపంచ న్యూమోనియా దినోత్సవం సందర్భంగా న్యూమోనియా వ్యాధి నివారణ గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని డా.వి.భవాని సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రారంభిస్తూ,న్యూమోనియా వ్యాధి శీతాకాలంలో ఎక్కువగా వస్తుందని మరి ముఖ్యంగా చిన్నపిల్లలలో దీని లక్షణాలు అనగా శ్వాశ నాళాలు మూసుకుపోవ డం ,ఊపిరి తీసుకున్నప్పుడు పిల్లి కూతలు రావడం కనిపిస్తాయని దీనిని నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యం ప్రమాదకర స్థితికి చేరుతుందని, కావున వెంటనే చికిత్స పొందాలని చెప్పారు.ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే వ్యాధి నిరోధక టీకాలు తీసుకోవడం,చలి గాలికి తిరగకుండా ఉండడం, వర్షంలో తడవకుండా ఉండటం, దూమపానం చేయకుండా ఉండడం, మాస్కులు ,స్వెట్టర్ లు వాడడం, గాడమైన వాసన గల రసాయనాలకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఈఓ వై.ఎస్.రాయుడు, పి హెచ్ ఎన్ కె.ఆదిలక్ష్మి, సూపర్వైజర్లు కే.సుధాకర్, ఎన్ అనురాధ ,స్టాఫ్ నర్స్ కె.కిరణ్మయి ,ఎల్ టి శిల్పా,ఫార్మసిస్ట్ ఈ. నగేష్, హెల్త్ అసిస్టెంట్ పి.నందీష్,ఏ ఎన్ ఎం కే .శారద, ఆశ కార్యకర్తలు ఎం. జ్యోతి, ఎం. దేవి, ఎఫ్ ఎన్ ఓ మాధురి మరియు ప్రజలు పాల్గొన్నారు.