BREAKING
వివాహ వేడుకకు రంగం సిద్ధం.. కొత్త జీవితంపై రిమి టోమి కాబోయే భర్త మాథ్యూ ఆసక్తికర పోస్ట్ మీర్జాపూర్ విజయపు ఒత్తిడిని అసలు తీసుకోను.. నటి శ్వేతా త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు క్యాన్సర్ ముప్పును దూరం చేసే అద్భుతమైన ఆరోగ్య అలవాట్లు.. నిపుణులు ఏం చెబుతున్నారు? న్యూజిలాండ్ గడ్డపై భారత ఫుట్‌బాల్ జట్టుకు ఘోర పరాభవం.. తొలి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో కివీస్ జయభేరి దర్శకుడిగా మారిన రవి మోహన్.. యోగి బాబు హీరోగా 'ఆన్ ఆర్డినరీ మన్' నుంచి కొత్త సాంగ్ రిలీజ్ దిగ్గజ నటుడు పద్మశ్రీ మధుకు అరుదైన గౌరవం.. ప్రథమ బిచ్చు తిరుమల పురస్కారం ప్రకటన భోజనం చేస్తూ స్మార్ట్‌ఫోన్ వాడే అలవాటు ఉందా.. అయితే ఈ తీవ్రమైన అనారోగ్య సమస్యలు తప్పవు 'పరిషత్' పీఠాలపై పరోక్ష పోరు! అభాగ్యులకు అండగా సేవా సంస్థలు! పుస్తకాలు చదవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే ప్రశాంత ఎన్నికలకు సహకరించండి... డిఎస్పి రాఘవులు వైకాపా నుండి తెదేపాలో చేరిన 50 కుటుంబాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా.. రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ నియంత్రణతో ముప్పుకు చెక్ పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నిషేదిద్దాం గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయండి :

మండల పరిషత్ పీఠంపై"మరడాన"ముద్ర..

Select Suryaa Now
మండల పరిషత్ పీఠంపై"మరడాన"ముద్ర..

 

గరుగుబిల్లి"రథసారథి"గా మరడాన నారాయణస్వామి!

ఎంపీపీ పీఠానికి వేళాయె.. మరడాన పట్టాభిషేకానికి రంగం సిద్ధం!

విధేయతకు పట్టం..ఎంపీపీగా మరడాన నారాయణస్వామి

పార్టీ కన్వీనర్ నుంచి మండల ప్రథమ పౌరుడిగా ప్రస్థానం

ఉల్లిభద్ర నుండి పరిషత్ పీఠం వరకు అలుపెరగని ప్రస్థానo

శ్రేణుల్లో వెల్లివిరుస్తున్న ఉత్సాహం..అభినందనల వెల్లువ

గరుగుబిల్లి, నవంబర్ 12, మేజర్ న్యూస్:గరుగుబిల్లి మండల రాజకీయా ల్లో కీలక ఘట్టం ఆవిష్కృతమవుతోం ది.మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) అధ్యక్ష పీఠాన్ని తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ మరడాన నారాయణ స్వామి అధిరోహించనున్నారు.ఇటీ వల జరిగిన పరిషత్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మరడాన నారాయణ స్వామి ఎంపీపీగా బాధ్యతలు చేపట్టేం దుకు మార్గం సుగమమైంది.ఈనెల 19వ తేదీన అధికారికంగా మరడాన నారాయణస్వామి పట్టాభిషేకం జరగ నుండటంతో మండల టిడిపి శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.పార్టీ కన్వీనర్‌గా గరుగుబిల్లి మండలంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మరడాన నారాయణస్వామి ఎంతో కృషి చేశారు.క్షేత్రస్థాయిలో కార్యకర్తల ను సమన్వయం చేస్తూ,ప్రజా సమస్య ల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న టిడిపి కన్వీనర్ నారాయణస్వామి పార్టీ అధిష్టానం వద్ద ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.ఉల్లిభద్ర గ్రామానికి చెందిన మరడాన నారాయణస్వామి సామాన్యుడిగా ప్రజల్లో మమేకమవు తూ అందరి మన్ననలు పొందారు.ఈ నేపథ్యంలో నారాయణస్వామి నిబద్ధత ను గుర్తించిన అధిష్టానం మండల పరిషత్ పీఠాన్ని అప్పగించేందుకు మొగ్గు చూపింది.ఈమేరకు ఎన్నికలు పూర్తయ్యేంతవరకు చూడకుండా ఎంపీ టీసీ అభ్యర్థులకు బీ ఫారాలు ఇచ్చే సమయంలోనే పార్టీ అధిష్టానం ఎంపీపీ అభ్యర్థిగా నారాయణస్వామిని ప్రకటిం చడం జరిగింది.నారాయణస్వామి త్వరలోనే ఎంపీపీగా బాధ్యతలు స్వీక రించనున్న నేపథ్యంలో స్వగ్రామమైన ఉల్లిభద్రలో పండుగ వాతావరణం కనిపిస్తోంది.పార్టీ కన్వీనర్ గా తన వంతు సేవలందిస్తున్న మరడాన నారాయణస్వామి ఎంపీపీగా మండ లంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తారని నాయకులు,కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తూ గరుగుబిల్లి మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతారని మండల ప్రజలు విశ్వసిస్తున్నారు.ఎంపీపీగా ఈ నెల 19వ తేదీన మరడాన నారాయణ స్వామి బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా మండలం లోని ఆయా గ్రామాలకు చెందిన టిడిపి నాయకులు, కార్యకర్తలు,అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు.