BREAKING
వివాహ వేడుకకు రంగం సిద్ధం.. కొత్త జీవితంపై రిమి టోమి కాబోయే భర్త మాథ్యూ ఆసక్తికర పోస్ట్ మీర్జాపూర్ విజయపు ఒత్తిడిని అసలు తీసుకోను.. నటి శ్వేతా త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు క్యాన్సర్ ముప్పును దూరం చేసే అద్భుతమైన ఆరోగ్య అలవాట్లు.. నిపుణులు ఏం చెబుతున్నారు? న్యూజిలాండ్ గడ్డపై భారత ఫుట్‌బాల్ జట్టుకు ఘోర పరాభవం.. తొలి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో కివీస్ జయభేరి దర్శకుడిగా మారిన రవి మోహన్.. యోగి బాబు హీరోగా 'ఆన్ ఆర్డినరీ మన్' నుంచి కొత్త సాంగ్ రిలీజ్ దిగ్గజ నటుడు పద్మశ్రీ మధుకు అరుదైన గౌరవం.. ప్రథమ బిచ్చు తిరుమల పురస్కారం ప్రకటన భోజనం చేస్తూ స్మార్ట్‌ఫోన్ వాడే అలవాటు ఉందా.. అయితే ఈ తీవ్రమైన అనారోగ్య సమస్యలు తప్పవు 'పరిషత్' పీఠాలపై పరోక్ష పోరు! అభాగ్యులకు అండగా సేవా సంస్థలు! పుస్తకాలు చదవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే ప్రశాంత ఎన్నికలకు సహకరించండి... డిఎస్పి రాఘవులు వైకాపా నుండి తెదేపాలో చేరిన 50 కుటుంబాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా.. రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ నియంత్రణతో ముప్పుకు చెక్ పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నిషేదిద్దాం గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయండి :

పరిషత్ పోరులో కీలక ఘట్టం.. ఎంపీపీ ఎన్నికకు వేళాయే

Select Suryaa Now
పరిషత్ పోరులో కీలక ఘట్టం.. ఎంపీపీ ఎన్నికకు వేళాయే

 

ఈనెల19న ఎంపీపీతో పాటు ఉపాధ్యక్షుల ఎన్నికల పర్వం

ఎన్నికకు తగు ఏర్పాట్లు చేస్తున్న మండల పరిషత్ అధికారులు

చేతులెత్తే విధానంలో మండల పరిషత్ అధ్యక్ష,ఉపాధ్యక్ష ఎన్నిక

సీతానగరం, నవంబర్ 12 మేజర్ న్యూస్:మండల ప్రజా పరిషత్ అధ్య క్షులు(ఎంపీపీ) మరియు ఉపాధ్యక్షుల ను(వైస్ ఎంపీపీ) ఎన్నుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముహూర్తం ఖరారు చేసింది.ఈమేరకు ఈ నెల 19వ తేదీన మండల పరిషత్ అధ్యక్షులు(ఎంపీపీ),మండల పరిషత్ ఉపాధ్యక్షులు (వైస్ ఎంపీపీ)తోపాటు కోఆప్షన్ సభ్యులు ఎన్నికల నిర్వహణ కు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ)తో పాటు వైస్ ఎంపీపీకి జరిగే ఎన్నికల ప్రక్రియ చేతు లెత్తే విధానంలో జరగనుంది.మండల ప్రజా పరిషత్తు అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల పరోక్ష ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం అధికారులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లును చేస్తున్నారు.ఈనెల 19న జరిగే ఎంపీపీ వైస్ ఎంపీపీ కో ఆప్షన్ సభ్యుల ఎన్ని కలకు హాజరుకావాలని కొత్తగా ఎన్ని కైన ఎంపిటిసి సభ్యులకు ఈనెల 14 లోపు నోటీసులు అందజేయనున్నా రు.19వ తేదీ ఉదయం 10 గంటల లోపు ఎంపీపీ, వైఎస్ ఎంపిపి పదవులకు పోటీ చేసే వారి నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు.10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్లను పరిశీలిస్తారు. చెల్లుబాటు అయ్యే నామినేషన్ల జాబి తాను 12 గంటలకు ఎన్నికల అధికారి ప్రకటించనున్నారు.మధ్యాహ్నం ఒంటి గంటలోపు నామినేషన్ ల ఉపసంహర ణకు అవకాశం ఉంటుంది. ఒంటిగంట కు కో- ఆప్షన్ సభ్యుల ఎన్నికకు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు.అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీపీ,వైస్ ఎంపీపీ ఎన్నికను నిర్వహించడం జరుగుతుందని మండల ఎన్నికల అధికారి కే అప్పలనాయుడు, ఉప ఎన్నికల అధికారి ఎం ఎల్ ఎన్ ప్రసాద్ తెలియజేశారు.ఈనెల 19న నిర్వహించ నున్న ఎంపీపీ,వైస్ ఎంపీపీ ఎన్నికకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.