నవంబర్ 14 నుండి 20 వరకు గ్రంథాలయ వారోత్సవాలు విజయవంతం చేయండి
గ్రంథాలయ అధికారి బి గణేష్ బాబు
సీతంపేట, నవంబర్ 12.
ఈనెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని ప్రతి విద్యార్థి పాల్గొని విజయవంతం చేయాలని గ్రంథాలయాధికారి బబ్బురు గణేష్ బాబు కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ 14వ తేదీ నుండి 19వ తేదీ వరకు విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, ఆటలు, పాటలు,రంగవల్లి పోటీ నిర్వహిస్తామని ఇందులో గెలుపొందిన విద్యార్థులకు ఈనెల 20వ తేదీ ముగింపు సభలో బహుమతుల ప్రధాన చేస్తామని ఆయన తెలిపారు.