BREAKING
వివాహ వేడుకకు రంగం సిద్ధం.. కొత్త జీవితంపై రిమి టోమి కాబోయే భర్త మాథ్యూ ఆసక్తికర పోస్ట్ మీర్జాపూర్ విజయపు ఒత్తిడిని అసలు తీసుకోను.. నటి శ్వేతా త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు క్యాన్సర్ ముప్పును దూరం చేసే అద్భుతమైన ఆరోగ్య అలవాట్లు.. నిపుణులు ఏం చెబుతున్నారు? న్యూజిలాండ్ గడ్డపై భారత ఫుట్‌బాల్ జట్టుకు ఘోర పరాభవం.. తొలి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో కివీస్ జయభేరి దర్శకుడిగా మారిన రవి మోహన్.. యోగి బాబు హీరోగా 'ఆన్ ఆర్డినరీ మన్' నుంచి కొత్త సాంగ్ రిలీజ్ దిగ్గజ నటుడు పద్మశ్రీ మధుకు అరుదైన గౌరవం.. ప్రథమ బిచ్చు తిరుమల పురస్కారం ప్రకటన భోజనం చేస్తూ స్మార్ట్‌ఫోన్ వాడే అలవాటు ఉందా.. అయితే ఈ తీవ్రమైన అనారోగ్య సమస్యలు తప్పవు 'పరిషత్' పీఠాలపై పరోక్ష పోరు! అభాగ్యులకు అండగా సేవా సంస్థలు! పుస్తకాలు చదవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే ప్రశాంత ఎన్నికలకు సహకరించండి... డిఎస్పి రాఘవులు వైకాపా నుండి తెదేపాలో చేరిన 50 కుటుంబాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా.. రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ నియంత్రణతో ముప్పుకు చెక్ పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నిషేదిద్దాం గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయండి :

ఆటపాటలతో కూడిన బోధనపై అంగన్వాడీలకు ప్రత్యేక శిక్షణ...ప్రాజెక్ట్ డైరెక్టర్ టి. కనకదుర్గ.

Select Suryaa Now
ఆటపాటలతో కూడిన బోధనపై అంగన్వాడీలకు ప్రత్యేక శిక్షణ...ప్రాజెక్ట్ డైరెక్టర్ టి. కనకదుర్గ.

 

"పోషణ్ భీ-పడాయీ భీ"తో చిన్నారుల్లో శారీరక,మేధో వికాసం.... సిడిపిఓ కే రాజలక్ష్మి.

సీతానగరం ,నవంబర్ 12, మేజర్ న్యూస్:చిన్నారులకు కేవలం పౌష్టికా హారం అందించడమే కాకుండా,బాల్య దశ నుంచే మెదడు వికాసానికి తోడ్పడే నాణ్యమైన విద్యను అందించే లక్ష్యం తో కేంద్ర మహిళా మరియు శిశు అభి వృద్ధి శాఖ ప్రతిష్ఠాత్మకంగా 'పోషణ్ భీ - పఢాయీ భీ' కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతోందని  ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ టి. కనకదుర్గ తెలిపారు.మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మండల పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలకు పోషణ్ భీ,పడాయి భీ’ కార్యక్రమంపై రెండు రోజులపాటు నిర్వహించిన శిక్షణా కార్యక్రమం గురువారం ముగింపు సందర్భంగా ఆమె పాల్గొని అంగన్వాడీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. జాతీయ నూతన విద్యా విధానం  మార్గదర్శకాలకు అనుగుణంగా జాతీ య విద్యా విధానం మార్గదర్శకాలకు అనుగుణంగా అంగన్‌వాడీ మరియు పోషణ్ 2.0 కింద దేశవ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలను ఆధునిక అభ్యాస కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నా రని తెలిపారు.మనిషి మెదడు ఎదుగు దలలో 85 శాతానికి పైగా ఆరేళ్ల వయసులోపే జరుగుతుందని శాస్త్రీయ పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయన్నా రు.ముఖ్యంగా పుట్టిన మొదటి 1,000 రోజులు అత్యంత కీలకమైనవి. దీనిని దృష్టిలో ఉంచుకుని, అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు పోషకా హారంతో పాటు, వారి వయసుకు తగినట్లుగా ఆటపాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్యను అందించేలా ఈకార్యక్రమాన్ని రూపొందించారన్నా రు.చిన్నారులపై చదువుల భారం మోపకుండా, ఆటలు, కథలు, బొమ్మ లు, కృత్యాల ద్వారా నేర్చుకునే వాతావరణాన్ని కల్పిస్తున్నారని పిఓ సుగుణ కుమారి పేర్కొన్నారు.రోజుకు కనీసం రెండు గంటల పాటు నాణ్య మైన పూర్వ ప్రాథమిక విద్యను అందించడం జరుగుతుందన్నారు. పిల్లలు విషయాలను సులభంగా అర్థం చేసుకునేలా వారి మాతృభాషలోనే ప్రాథమిక బోధన సాగేలా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.జాతీయ నూతన విద్యా విధానం  మార్గదర్శ కాలకు అనుగుణంగా ఈకార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందన్నా రు.చిన్నారులలో 85 శాతానికి పైగా మెదడు అభివృద్ధి 6 సంవత్సరాల వయస్సు లోపే జరుగుతుందని శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నాయ న్నారు.ఈనేపథ్యంలో 0 నుండి 6 సంవత్సరాలలోపు చిన్నారులకు బలవర్ధకమైన ఆహారంతో పాటు,వారి వయస్సుకు తగినట్లుగా ఆటపాటల ద్వారా విద్యను అందించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం అని చెప్పారు.చిన్నారులు సులభంగా అర్థం చేసుకునేలా వారి మాతృభాషలోనే బోధన సాగుతోందన్నారు. అనంతరం సిడిపిఓ కే రాజలక్ష్మి.  మాట్లాడుతూ దేశ భవిష్యత్తుకు బలమైన పునాది వేసేందుకు కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ  చేపట్టిన ‘పోషణ్ భీ, పఢాయి భీ’ కార్యక్రమం అంగన్‌ వాడీ కేంద్రాల రూపురేఖలను సమూ లంగా మార్చివేస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్స్ బి. పద్మ . వై రేవతి  . జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎల్. దాలి నాయుడు తో పాటు పలువురు అంగన్వాడి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు